Share News

Vamsi Court Appearance: విజయవాడ కోర్టుకు వల్లభనేని వంశీ

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:44 PM

Vamsi Court Appearance: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ రిమాండ్ నేటితో ముగియడంతో విజయవాడ కోర్టులో ఆయనను హాజరుపర్చారు పోలీసులు.

Vamsi Court Appearance: విజయవాడ కోర్టుకు వల్లభనేని వంశీ
Vamsi Court Appearance

అమరావతి, ఏప్రిల్ 23: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi) ఈరోజు (బుధవారం) విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటితో వంశీ రిమాండ్ ముగిసింది. దీంతో ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వచ్చే నెల (మే) 7 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడి జరిగింది. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉండి అనునాయులను, వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని మాజీ ఎమ్మెల్యేపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో 72వ నిందితుడిగా వంశీ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. అంతే కాకుండా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో కూడా వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.


నిన్న ఇదే కోర్టులో సత్యవర్థన్‌కు సంబంధించిన కేసులో వంశీని హాజరుపర్చగా.. 14 రోజుల పాటు వంశీ రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటితో రిమాండ్ ముగియడంతో వంశీని కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. రిమాండ్ పొడిగించే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెండు కేసులకు సంబంధించి ఇప్పటికే బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేయగా.. ఆ రెండు పిటిషన్లను విజయవాడ కోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.

PSR Court Hearing: జెత్వానీ కేసులో ఏం జరిగిందో చెప్పిన పీఎస్‌ఆర్


దీంతో ఆయన ఈ కేసులపై బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తున్నారు. వంశీకి సంబంధించిన కేసులో వరుసగా కోర్టులో ఉండటం.. ఎప్పటికప్పుడు న్యాయస్థానంలో బిగ్‌ షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పైస్థాయిలో బెయిల్‌ను పొందేందుకు వంశీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. రిమాండ్‌కు సంబంధించి కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడటంతో.. వెంటనే తిరిగి వంశీని విజయవాడ జిల్లా జైలుకు పోలీసులు తరలించనున్నారు. ఇదిలా ఉండగా.. స్థలం ఆక్రమణ కేసులో బెయిల్‌ కోసం హైకోర్టులో వంశీ పిటిషన్‌ వేయగా.. అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. ఈ కేసు విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి

PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు

Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 03:21 PM