Share News

Vamsi Bail: వంశీకి మళ్లీ నిరాశే

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:03 PM

Vamsi Bail: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశే ఎదురైంది. వంశీ బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

Vamsi Bail: వంశీకి మళ్లీ నిరాశే
Vamsi Bail Petition

అమరావతి, ఏప్రిల్ 21: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi) బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను వారం రోజులకు ఏపీ హైకోర్టు (AP High Court) వాయిదా వేసింది. స్థలం ఆక్రమణ కేసులో బెయిల్ కోసం వంశీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈరోజు (సోమవారం) ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈకేసు విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయవాడ జిల్లా జైలులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.


కాగా.. ఇప్పటికే వల్లభనేని వంశీపై పీటీ వారెంట్లు దాఖలు చేయడంతో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయనపై విజయవాడలో ఎస్సీ, ఎస్టీ కేసుతో సహా ఇంకా సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులు నమోదై ఉన్నాయి. మరికొన్ని కేసుల్లో కూడా పీటీ వారెంట్ దాఖలు చేయడంతో వాటిలో రిమాండ్ విధించారు. ఈ క్రమంలో ఈరోజు స్థలం ఆక్రమణ కేసులో బెయిల్ కోసం వంశీ పిటిషన్ వేయగా.. విచారణను న్యాయస్థానం వారం రోజులకు వాయిదా వేసింది.

Jharkhand Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి


అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్ గడువును కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని కోర్టులో ఇటీవల వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో వంశీ రిమాండ్ గడువును ఈనెల 23 వరకు విజయవాడ సీఐడీ కోర్టు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి వంశీతో పాటు తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. ఈకేసులో ఇప్పటికే పలుమార్లు రిమాండ్‌ను పొడిగించిన కోర్టు.. మరోసారి కూడా రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

Jharkhand Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

Tirumala Darshan: శ్రీవారిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారో తెలుసా

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 12:22 PM