Robin Hood Movie Team: పుష్ప-3పై ఇంట్రెస్టింగ్ అప్టేట్ ఇచ్చిన రాబిన్ హుడ్ నిర్మాత రవిశంకర్..
ABN , Publish Date - Mar 16 , 2025 | 07:09 PM
విజయవాడలోనే తాను చదువుకుని దర్శకుడిగా మారినట్లు రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తెలిపారు. తాను దర్శకత్వం వహించిన ఛలో, భీష్మ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి విజయవంతం చేశారని చెప్పుకొచ్చారు.

అమరావతి: విజయవాడ నగరంలో రాబిన్ హుడ్(Robin Hood) చిత్ర బృందం సందడి చేసింది. హీరో నితిన్(Hero Nithin), దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్ (Producer Ravishankar) అభిమానులతో ముచ్చటించి ఉత్సాహపరిచారు. ముందుగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్న చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం బందర్ రోడ్‌లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. "ఈనెల 28న రాబిన్ హుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. దుర్గమ్మ ఆశీస్సులతో సినిమా ప్రమోషన్‌ను విజయవాడ నుంచే ప్రారంభించాం. రాబిన్ హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ ముఖ్య పాత్రలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో భీష్మ సినిమాలో నటించా. ఆ చిత్రం అప్పుడు విజయం సాంధించింది. రాబిన్ హుడ్ చిత్రం కూడా అదే రీతిలో సక్సెస్ అవుతుందని భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‍ను త్వరలోనే కలుస్తానని" చెప్పారు.
విజయవాడలోనే తాను చదువుకుని దర్శకుడిగా మారినట్లు రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తెలిపారు. తాను దర్శకత్వం వహించిన ఛలో, భీష్మ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి విజయవంతం చేశారని చెప్పుకొచ్చారు. నితిన్‍ని డైరెక్ట్ చేసిన రెండో మూవీ రాబిన్ హుడ్ కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. నితిన్ అన్ని క్యారెక్టర్లకు సరిపోయే హీరో అని నిర్మాత రవిశంకర్ అన్నారు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుష్-3 గురించి నిర్మాత రవిశంకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. పుష్ప-3 సినిమా షూటింగ్ త్వరలో మొదలు కాబోతోందని వెల్లడించారు. మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తామని రవిశంకర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Namrata Shirodkar: మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు మరింత విస్తృతం: నమ్రత
Minister Nara Lokesh: పదో తరగతి విద్యార్థులకు కీలక సూచనలు చేసిన మంత్రి లోకేశ్..