CID Custody: రెండో రోజు సీఐడీ కస్టడీకి పీఎస్‌ఆర్
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:19 PM
CID Custody: ముంబై నటి జెత్వానీ అక్రమ అరెస్ట్, నిర్బంధం కేసుకు సంబంధించి పీఎస్‌ఆర్ ఆంజేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

విజయవాడ, ఏప్రిల్ 28: ముంబై నటి కాదంబరి జెత్వానీ (Mumbai actress Kadambari Jethwani) కేసులో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సీఐడీ కార్యాలయానికి పీఎస్సార్ ఆంజనేయులును అధికారులు తరలించారు. అయితే నిన్న హైబీపీ కారణంగా పీఎస్‌ఆర్‌ను సీఐడీ విచారించని విషయం తెలిసిందే. దీంతో విచారణను అధికారులు ఈరోజు వాయిదా వేశారు. జెత్వానీ అరెస్టు, నిర్బంధం వ్వహహారంలో పీఎస్సార్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
ముంబై నటి జెత్వానీ అక్రమ అరెస్ట్, నిర్బంధం కేసుకు సంబంధించి పీఎస్‌ఆర్ ఆంజేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జెత్వానీ కేసులో ఎవరి ఆదేశాలతో ఆయన వ్యవహారం నడిపించారు.. విశాఖ గున్నీని ముంబై పంపించాల్సిన అవసరం ఏంటి, ఎవరు చెబితే ఇదంతా చేశారు అనే అంశాలపై ఆరా తీయనున్నారు. జెత్వానీ కేసుకు సంబంధించి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని పీఎస్‌ఆర్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో మూడు రోజుల పాటు ఆయనను విచారించేందుకు కోర్టు అనుమతించింది. నిన్న, ఈరోజు, రేపు ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నిన్న తొలిరోజు ఉదయం 10:30 గంటలకు విజయవాడ జిల్లా జైలుకు వెళ్లిన సీఐడీ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.
Visakhapatnam Mayor: విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం
అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు పీఎస్‌ఆర్‌కు హై బీపీ ఉన్నట్లు నిర్ధారించారు. దాంతో ఆయన కాస్త ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సీఐడీ అధికారులు విచారణను వాయిదా వేసి వైద్యసేవలు అందించాల్సిందిగా వైద్యులను కోరారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. అయినప్పటికీ బీపీ కంట్రోల్‌లోకి రాలేదని వైద్యులు చెప్పడంతో విచారణను వాయిదా వేసింది సీఐడీ. వెంటనే పీఎస్‌ఆర్ నిన్న మధ్యాహ్నం తిరిగి జిల్లా జైలుకు తరలించారు.
తిరిగి ఈరోజు (సోమవారం) ఉదయం 10:30 గంటలకు విజయవాడ జిల్లా జైలు నుంచి పీఎస్‌ఆర్‌ను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు.. వైద్య పరీక్షల అనంతరం సీఐడీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. జెత్వానీ కేసును ఎవరు అప్పగించారు.. ఎవరి ఆదేశాలతో ఈ కేసులో భాగస్వామిగా మారారు అనే అంశాలపై సీఐడీ అధికారులు ఆరా తీయనున్నారు. రెండు రోజుల విచారణలో పీఎస్‌ఆర్ నుంచి కొంత సమాచారం సేకరించే పనిలో ఉంది సీఐడీ. పీఎస్‌ఆర్ నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి మరికొంత మందిపై కేసు నమోదు చేయడం లేదా అదుపులోకి తీసుకుని విచారించే అంశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Fire Incident: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్
Read Latest AP News And Telugu News