Kollu Ravindra Warn: లిక్కర్ స్కామ్.. కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్
ABN , Publish Date - Apr 23 , 2025 | 03:38 PM
Kollu Ravindra Warn: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణంపై మంత్రి కొల్లురవీంద్ర స్పందించారు. మద్యం స్కాంలో బాగోతాలన్నీ బయటకొస్తున్నాయని తెలిపారు.

అమరావతి, ఏప్రిల్ 23: రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం (Liquor Scam) కేసు హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ స్కామ్‌లో నిందితులను పట్టుకునేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు ఆధారాలను సేకరించిన సిట్... ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా.. షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. జగన్ చెప్పడం వల్లే తాను చేసినట్లు అంగీకరించారు రాజ్ కసిరెడ్డి. ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తుండటంపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా అరాచక శక్తులకు స్థానం లేదంటూ వైసీపీకి మాస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి.
మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారంటే
బిగ్ బాస్ బండారం మొత్తం బయటపెడతామని హెచ్చరించారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వ లేక వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మద్యం స్కాంలో బాగోతాలన్నీ బయటకొస్తున్నాయని తెలిపారు. పేదల బియ్యాన్ని బొక్కిన పేర్ని నాని నేడు బీరాలు పోతున్నాడంటూ విమర్శించారు. మచిలీపట్నంలో కనీ వినీ ఎరుగని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ప్రజాస్వామ్యంలో అరాచక శక్తులకు స్థానం లేదని మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా.. లిక్కర్ స్కామ్ కేసులో గత కొద్దిరోజులుగా తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తీసుకొచ్చి.. లిక్కర్ స్కామ్‌పై సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో పలు కీలక విషయాలను సిట్ అధికారులు రాబట్టారు. అనంతరం కసిరెడ్డిని కోర్టుకు తరలించగా రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు. మద్యం కుంభకోణం కేసులో మొత్తం 29 మందిని నిందితులగా చేర్చారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి ఏ1గా ఉన్నారు. అలాగే కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రభుత్వానికి, పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీపై వర్కవుట్ చేసే బాధ్యతను అప్పటి సీఎం జగన్ తనకు చెప్పినట్లు కసిరెడ్డి ఒప్పుకున్నారు. అందరూ కలిసే మద్యం నుంచి ముడుపులు రాబట్టేందుకు పథకం రచించినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ కేసులో తన పాత్ర, కుట్ర, నేరాన్ని అంగీకరించిన కసిరెడ్డి నేరాంగీకారపత్రంపై సంతకం చేసేందుకు అంగీకరించనట్లు సిట్ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు
Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ
Read Latest AP News And Telugu News