Birthday Celebrations: అట్లాంటాలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు
ABN , Publish Date - Apr 21 , 2025 | 10:16 AM
సీఎం చంద్రబాబు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన రోజని, గత ఏడాది పర్యటనలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చోటే చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాము అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను తీర్చడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందు నిలబడుతూ... రాష్ట్ర తలరాతను మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.

అమరావతి: అట్లాంటా (Atlanta) స్టేట్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) 75వ పుట్టినరోజు (75th Birthday) వేడుకలు (Celebrations) ఘనంగా జరిగాయి. కమ్మింగ్ ఎన్‌టిఆర్ స్టాట్యూ 2450 మౌంటైన్ రోడ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే (Gudivada TDP MLA) వెనిగండ్ల రాము ( Venigandla Ramu) ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబును గుండెల్లో పెట్టుకొని పూజిస్తానని అన్నారు. పనికిమాలిన వ్యక్తులను టార్గెట్ చేయడానికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ప్రజల మంచి కోసం కష్టపడి పనిచేయడమే చంద్రబాబు బలమని అన్నారు. ప్రవాసాంధ్రులు చంద్రబాబు పి.4లో భాగస్వాములు కావాలని పిలుపిచ్చారు.
Also Read..: చెప్పిన మాటకు కట్టుబడని నేత..
చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనం...
సీఎం చంద్రబాబు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన రోజని, గత ఏడాది పర్యటనలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చోటే చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాము అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను తీర్చడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందు నిలబడుతూ... రాష్ట్ర తలరాతను మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. ఖండాంతరాలు దాటి పుట్టినరోజు వేడుకలు జరుగుతుండడమే చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబుకు సాటి వచ్చే వ్యక్తి దేశంలో నరేంద్రమోదీ తప్ప మరొకరు ఉండరని అన్నారు.
అదే చంద్రబాబు ఆలోచన..
తెలుగు ప్రజలందరూ రుణపడి ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు అని, మోడ్రన్ హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశారో ప్రపంచ స్థాయిలో అమరావతి లాంటి గొప్ప నగర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళుతున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు. మనం చేసే పనులు భవిష్యత్తు తరాలకు ఎలా ఉపయోగపడతాయో అని నిరంతరం ఆలోచిస్తున్నారని, ఇంకా కొందరిని జైలుకు పంపడం లేదేంటని మనం ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు మాత్రం ప్రజలకు ఏం మంచి చేయాలో అని నిరంతరం ఆలోచిస్తారని అన్నారు. చట్ట ప్రకారంగానే వ్యవహరించాలనేదే చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. ఐదేళ్లపాటు పనికిరాని వ్యక్తులు చంద్రబాబు గురించి నీచంగా మాట్లాడారని.. ఇప్పుడు అధికారం ఉంది కదా అని వాళ్ళని టార్గెట్ చేయకుండా.... ప్రజల కోసం కష్టపడుతున్నారని అన్నారు.
అదే చంద్రబాబు బలం..
గత ప్రభుత్వం తనకు చేసిన అన్యాయాలను చంద్రబాబు దిగమింగి.. ఏపీ రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం ఇలా ప్రజలకు ఏం కావాలో వాటి కోసమే ఆయన కష్టపడుతున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రజల మంచి కోసం కష్టపడి పనిచేయడమే చంద్రబాబు బలమని అన్నారు. ఎన్టీఆర్ తనకు ఆరాధ్యదైవం అయితే.... చంద్రబాబును గుండెల్లో పెట్టుకొని పూజిస్తానని మరొక సారి అన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగువారి అభివృద్ధిని చూసి... చంద్రబాబు ఎంతో గర్వంగా చెబుతారన్నారు. చంద్రబాబు 2047 విజన్‌లో మనందరం భాగస్వామ్యులమవుదామని పిలుపిచ్చారు. చంద్రబాబు ఆలోచనలే... రేపటి భావితరాల అభ్యున్నతికి వారదులుగా మారుతున్నాయని, చంద్రబాబు విజన్ నుండి పుట్టుకొచ్చిన ఆలోచనలే నేడు దేశం మొత్తం అమలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు వందేళ్లపాటు ఇదే ఉత్సాహంతో పనిచేసి.. తెలుగు వారందరిని ముందుకు తీసుకెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఎన్నారైల మనసులు తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా... మీ ప్రాంతాల్లో ఏ మంచి పని చేయాలన్న తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. మీరు చేయాలనుకున్న మంచి పనులు తనవిగా భావించి... వాటిని ముందుకు తీసుకెళతానన్నారు. ‘మీకు ఆసక్తి ఉన్న ఏ అంశంలోనైనా భాగస్వామ్యం అవ్వండి... ప్రజల మంచి కోసం చంద్రబాబుతో కలిసి పని చేయండి’ అంటూ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు
డోనాల్డ్ ట్రంప్ తీరుపై స్పందించిన భారత్..
For More AP News and Telugu News