SIT Investigation: సిట్ ముందుకు సాయిరెడ్డి.. ఇక జగన్‌లో దడ
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:41 PM
SIT Investigation: మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు మాజీ ఎంపీ సాయిరెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మాజీ ఎంపీ వాంగ్మూలం కీలకం కానుంది.

విజయవాడ, ఏప్రిల్ 18: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం దర్యాప్తును సిట్ (SIT) వేగవంతం చేసింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Former MP Vijayasai Reddy) సిట్ ముందు హాజరయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట సాయి రెడ్డి విచారణకు వెళ్లారు. లిక్కర్ కుంభకోణం కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. మరోవైపు లిక్కర్ స్కాంలో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి వరుసగా రెండో రోజు విచారణకు వెళ్లారు. ఆయనతో పాటు రాజ్ సహాయకుడి తండ్రిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు
ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం సరిగ్గా రెండు గంటల సమయంలో సిట్ ముందుకు వచ్చారు మాజీ ఎంపీ. భోజన విరామం అనంతరం సిట్ ముందుకు వస్తానని విజయసాయి ముందుగానే సిట్ అధికారులకు సమాచారం పంపారు. అందులో భాగంగా సరిగ్గా 2 గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. వేల కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేలా చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డే అంటూ గతంలో విచారణకు వచ్చిన సందర్భంలో విజయసాయి చెప్పిన విషయం తెలిసిందే.
తనను ఎన్ని సార్లు విచారణకు పిలిచినా అదే విషయాన్ని చెబుతానని చెప్పారు కూడా. అందులో భాగంగా ఈరోజు విచారణకు రావాల్సిందిగా విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. అయితే సిట్ అధికారులు ఏప్రిల్ 18న (ఈరోజు) రావాలని మొదట నోటీసులు ఇవ్వగా.. ఏప్రిల్ 17న అంటే నిన్న వస్తానని కబురు పంపారు సాయిరెడ్డి. అయితే కొన్ని కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని మరోసారి సమాచారం ఇచ్చారు. ఈరోజు కచ్చితంగా విచారణకు వస్తానని చెప్పిన విజయసాయి.. అన్న ప్రకారమే మధ్యాహ్నం 2 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయి ఏం చెప్పబోతున్నారు అనేది ఉత్కంఠంగా మారింది.
ఇక మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి తండ్రిని కూడా విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన సిట్ ముందు నిన్న విచారణకు రాగా.. పలు ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. కసిరెడ్డి తండ్రి సెల్‌ఫోన్‌ను తీసుకుని కాల్ లిస్ట్‌ను చెక్ చేశారు. మీ అబ్బాయి ఎక్కడున్నారని అడుగగా తెలియదనే సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నో ప్రశ్నలకు కూడా రాజ్ తండ్రి మౌనమే వహించినట్లు సమాచారం. అలాగే ఈరోజు కూడా విచారణకు రావాలని చెప్పడంతో సిట్ ఆఫీసుకు వచ్చారు రాజ్ తండ్రి. కసిరెడ్డి గురించి పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విచారణ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
Summer Vacation Safety Tips: తస్మాత్ జాగ్రత్త.. పిల్లల సరదా ఆట విషాదం కావొద్దు
Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా
Read Latest AP News And Telugu News