Share News

Indrakeeladri: బెజవాడ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర బహుకరణ

ABN , Publish Date - May 15 , 2025 | 07:19 AM

Indrakeeladri: తెలంగాణ రాష్ట్రం, సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ అనే భక్తుడు బెజవాడ కనకదుర్గ అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ ఆయనను అభినందించి అమ్మవారి తీర్థ ప్రసాదములను అందజేశారు.

Indrakeeladri: బెజవాడ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర బహుకరణ
Matchbox silk saree

విజయవాడ: ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై కొలువైన కనకదుర్గమ్మకు (Kanaka Durga) ఓ భక్తుడు (Devotee) అగ్గిపెట్టెలో (Matchbox) పట్టే పట్టుచీర (Silk Saree) బహుకరించారు. తెలంగాణ రాష్ట్రం, సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయకుమార్‌ (Nalla Vijay Kumar) అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను అమ్మవారికి బహూకరించారు. తొలుత పట్టు చీరను అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉంచి పూజ కార్యక్రమాలు చేసిన అనంతరం ఆలయ ఈవో శీనానాయక్‌కు అందజేశారు.


సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్, ఆయన తండ్రి నల్ల పరంధాములు చేనేత కళారంగంలో నిపుణులు. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర, శాలువను, కుట్టు లేకుండా లాల్చి పైజామా, జాతీయ జెండా, మూడు కొంగుల చీరను, సుగంధ ద్రవ్యాల సువాసన వచ్చే చీర, దబ్బనంలో దూరిపోయే చీర, బంగారం, వెండి చీరలను వారు రూపొందించారు.

Also Read: ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని సమాధానం చెప్పాలి


నల్ల విజయ్ కుమార్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర తయారుచేసి అమ్మవారికి కానుకగా అందించారు. చీర బరువు 100 గ్రాములు, దీని పొడవు ఐదున్నర మీటర్లు, వెడల్పు 48 ఇంచులు. దీనిని పూర్తిగా పట్టు దారాలతో, గోల్డ్ జరీ వాడినట్లు ఆయన తెలిపారు. ఈ పట్టు చీరను తయారు చేయడానికి ఐదు రోజులు పట్టిందని ఆయన అన్నారు. పట్టు చీరను బహుకరించిన విజయ్ కుమార్‌ను ఈవో శీనానాయక్ అభినందించి, అమ్మవారి తీర్థ ప్రసాదములను అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీనివాస గోవిందా పాట తొలగించకుంటే

అందాల పోటీల కోసం పేదల ఇళ్లు కూలుస్తారా?

For More AP News and Telugu News

Updated Date - May 15 , 2025 | 07:19 AM