Share News

CM Chandrababu Orders: సరుకులు అందించండి.. నిర్వాసితులను ఆదుకోండి.. టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:30 PM

జిల్లా కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు.

CM Chandrababu Orders: సరుకులు అందించండి.. నిర్వాసితులను ఆదుకోండి.. టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం
CM Chandrababu Orders

అమరావతి, అక్టోబర్ 29: మొంథా తుపాను (Cyclone Montha) ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు (బుధవారం) జిల్లా కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు సీఎం పలు సూచనలు చేశారు.


టెలీకాన్షరెన్స్‌లో సీఎం కామెంట్స్..

  • గత నాలుగైదు రోజుల నుంచి మొంథా తుపాను విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టాం.

  • సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్‌తో సహా అంతా కలిసి టీమ్‌గా పనిచేశాం.

  • కష్టకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.

  • మరో రెండు రోజులు ఇదే విధంగా పని చేస్తే... బాధిత ప్రజలకు మరింత ఊరట ఇవ్వగలం.

  • తుపాను వెలిసింది కాబట్టి... వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా అధికారులు పని చేయాలి.

  • మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి.. వారికేమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలి.

  • మొంథా తుపాను వల్ల వివిధ విభాగాల్లో కలిగిన నష్టాన్ని అంచనా వేయాలి.. కేంద్రానికి నివేదిక అందివ్వాలి.


  • తుపాను బాధితులకు నిత్యావసర సరుకులు వెంటనే అందించాలి. నిర్వాసితులను ఆదుకోవాలి.

  • ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల నష్టాన్ని చాలా వరకు నివారించగలిగాం.

  • సచివాలయాలపై మైక్ అనౌన్స్‌మెంట్ సిస్టంను ఏర్పాటు చేసి కింది స్థాయి వరకూ ప్రభుత్వ ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాం. ఇదొక నూతన విధానం తీసుకొచ్చాం.

  • తుపానును ఎవరూ నివారించలేరు... కానీ ముందు జాగ్రత్తలతో నష్టాలను నివారించగలుగతాం.

  • కలెక్టర్లు, అధికారులు కంట్రోల్ రూమ్‌లో కూర్చుని రియల్ టైం సమాచారం తెప్పించుకుని జాగ్రత్తలు తీసుకున్నారు.

  • ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్‌ సిబ్బంది బాగా పని చేశారు. చెట్లు కూలినా, విద్యుత్ వైర్లు తెగిపడినా యుద్ధప్రాతిపదికన తొలగించారు.

  • అన్ని మున్సిపాలిటీల్లో డ్రెయిన్లు క్లీన్ చేయడం వల్ల కాలనీలను ముంపుబారిన పడకుండా చేశాం.

  • దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థను కూడా పునరుద్ధరించేందుకు 10 వేలమందిని అందుబాటులో పెట్టుకున్నాం. నేడు మధ్యాహ్నానికి సాధారణ స్థితి ఏర్పడుతుంది.

  • తుపాను కారణంగా ఇద్దరు చనిపోయారు.

  • ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. మన చర్యలతో ప్రభుత్వంపై భరోసా పెరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

శ్రీశైలంలో కుండపోత వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

బాహుదా నదికి పోటెత్తిన వరద.. ఇచ్ఛాపురం జలదిగ్భంధం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 01:32 PM