Case Filed: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు
ABN , Publish Date - Apr 29 , 2025 | 09:22 AM
పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హాయ్ ల్యాండ్‌లో జరిగిన గ్రూప్ -1 పేపర్ మూల్యాంకనం గుట్టు రట్టు చేసే దిశలో ప్రత్యేక పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.

అమరావతి: వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ -1 (Group-1)లో పీఎస్సార్ ఆంజనేయులు (PSR Anjaneyulu) చేసిన అక్రమాలపై కేసు (Case) నమోదు అయింది. మోసం, నిధులు దుర్వినియోగం, నేరపూరిత కుట్ర సెక్షన్లు కింద కేసు నమోదు అయింది. కేసు విచారణ బాధ్యతను సీనియర్ పోలీస్ అధికారికి ఉన్నతాధికారులు అప్పగించారు. ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హాయ్ ల్యాండ్‌లో జరిగిన గ్రూప్ -1 పేపర్ మూల్యాంకనం గుట్టు రట్టు చేసే దిశలో ప్రత్యేక పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన అనంతరం కేసు విచారణను ఏసీబీకు అప్పగించే అవకాశం ఉంది.
Also Read: పాకిస్థాన్ దేశస్థులు భారత్‌ను వీడేందుకు చివరి రోజు..
మంగళవారంతో ముగియనున్న పీఎస్సార్ కస్టడీ..
కాగా ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో మంగళవారం కూడా పీఎస్సార్‌ను సీఐడీ అధికారులు విచారించనున్నారు. కానూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు సీఎస్సార్‌ను ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి ఆధ్వర్యంలో రెండు బృందాలు పీఎస్సార్‌ను ప్రశ్నించాయి. మొత్తం 82 ప్రశ్నలు అడిగితే వాటికి దాటవేత ధోరణిలోనే సమాధానాలు చెప్పారు. జెత్వానీపై కేసు నమోదు చేయలని ఎవరు ఆదేశించారని అడిగితే అసలు ఆమె ఎవరో తనకు తెలియదని ఆయన బదులిచ్చారు. కుక్కల విద్యాసాగర్ ఎవరి ద్వారా కలిశారని అడిగినా తనకు తెలియదని చెప్పారు. జెత్వానీపై కేసు నమోదు చేయడానికి ముందు జగన్ నివాసానికి వెళ్లారా కదా అని ప్రశ్నిస్తే వెళ్తే వెళ్లి ఉండొచ్చు అంటూ దాటవేశారు. కాగా కోర్టు ఇచ్చిన మూడు రోజుల గడువు మంగళవారంతో ముగియనుంది. చివరి రోజు సీఐడీ మరో 80 ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం పీఎస్సార్‌ను జైలుకు తరలించనున్నారు.
పోలీసు భోజనం వద్దు..
సోమవారం విచారణకు హాజరైన పీఎస్ఆర్.. పోలీసులు అందించిన భోజనం తినడానికి ఇష్టపడలేదు. ఉదయం సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లాక అల్పాహారం తీసుకోవాలని వారు కోరగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. భోజన విరామ సమయంలో భోజనం చేయాలని సూచించగా.. ‘మీ పోలీసు భోజనం నాకొద్దు’ అని చెప్పారు. సీనియర్ పోలీసు అధికారిగా ఉన్న పీఎస్ఆర్.. తనకు, పోలీసు శాఖకు మధ్య గీత గీశారని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఆయన కాఫీ మాత్రమే తాగినట్లు తెలిసింది.
ఇంటి భోజనం అనుమతించాలంటూ పిటిషన్..
తనకు ఇంటి నుంచి భోజనం, మందులు, తాగునీరు అనుమతించాలని ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడలోని మూడో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. జైలులో నిద్రపోవడానికి సౌకర్యంగా ఉండే పడకను ఏర్పాటు చేయాలని ఆయన తరఫున న్యాయవాది విష్ణువర్ధన్ దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు
ఈ వార్తలు కూడా చదవండి..
చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో హైడ్రామా
మృతదేహాలను చూపి రాష్ట్ర హోదా డిమాండ్ చేయను
For More AP News and Telugu News