Share News

AP Rain Alert: ఏపీకి వర్ష సూచన.. వారం రోజుల్లో

ABN , Publish Date - Nov 22 , 2025 | 03:07 PM

ఏపీలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఈనెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ వెల్లడించింది.

AP Rain Alert: ఏపీకి వర్ష సూచన.. వారం రోజుల్లో
AP Rain Alert

అమరావతి, నవంబర్ 22: ఇటీవల మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు (Heavy Rains) రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అనేక జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగింది. ఆ పరిస్థితులను నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో మరోసారి వర్షాలు ఏపీని ముంచెత్తనున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ - వాయవ్య దిశగా కదులుతూ ఈనెల 24 (సోమవారం) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో పశ్చిమ - వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రైతులకు ముఖ్య సూచనలు

వర్షాలు రానున్న నేపథ్యంలో రైతులకు విపత్తుల నిర్వహణ సంస్థ పలు ముఖ్య సూచనలు చేసింది. ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని తెలిపింది. పండిన ధాన్యాన్ని వర్షంలో తడవకుండా సురక్షితంగా భద్రపరచుకోవాలని సూచించింది. ధాన్యం తడిసి రంగు మారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలని పేర్కొంది. తడిసిన గింజలు మొలకెత్తకుండా, నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పడాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ సూచనలు చేసింది.


ఇవి కూడా చదవండి...

రూ.6 లక్షలకు శిశువు విక్రయం.. కరీంనగర్‌లో దారుణం

అపోహలు నమ్మొద్దు.. ఆరు నెలల్లో పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 22 , 2025 | 04:04 PM