Kodali Nani: కొడాలి నానికి బిగ్ షాక్.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు
ABN , Publish Date - Mar 07 , 2025 | 10:58 AM
Kodali Nani: ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నానిపై గుడివాడ-02 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో, మరో రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే.ఇప్పుడు కొడాలి నానికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన సన్నిహితులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

కృష్ణాజిల్లా (గుడివాడ): ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి (Former minister Kodali Nani) వరుస షాక్‌లు తగులుతున్నాయి. కొడాలి నాని అత్యంత సహితులకు 41ఏ నోటీసులను గుడివాడ పోలీసులు జారీ చేశారు. వలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం....లిక్కర్ గౌడౌన్ వ్యవహారంలో బెదిరింపుల కేసుల్లో కొడాలి నాని షాడోగా పేరుపొందిన దుక్కిపాటి శశిభూషన్, సన్నిహిత మిత్రుడు పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులకు 41ఏ నోటీసులను గుడివాడ పోలీసులు జారీ చేశారు. ఈ రెండు కేసుల్లో మాజీ మంత్రి కొడాలి నాని, అప్పటి ఏపీ బెవరేజేస్ ఎండీ వాసుదేవరెడ్డి , జేసీ మాధవీలతరెడ్డి తదితరులపై వివిధ సెక్షన్ల కింద గుడివాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో కోర్టుకు వెళ్లడంతో 41ఏ నోటీసులిచ్చి విచారణ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో 41 ఏ నోటీసులను కొడాలి నాని సన్నిహితులు అందుకున్నారు.
కొడాలి నానిపై కేసులు..
కాగా.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నానిపై గుడివాడ-02 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో, మరో రెండు కేసులు నమోదయ్యాయి. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలతా రెడ్డిలపై కేసు నమోదు అయ్యింది. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై 448,427,506 ఆర్ అండ్ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Janasena leaders criticize Ambati: వైసీపీ పాకిస్థాన్.. కూటమి ఇండియా.. జనసేన నేతల ఫైర్
YSRCP: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నాయకులు
Raghuramakrishna Raju : బుల్లెట్ దిగిందా.. లేదా.. అన్నట్టు మాట్లాడాలి..
Read Latest AP News and Telugu News