Share News

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:08 PM

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌కు మరో షాక్‌ తగిలింది. చెవిరెడ్డి పీఏలను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది.

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు
AP Liquor Scam

అమరావతి, జూన్ 30: ఏపీ మద్యం కుంభకోణం కేసు (AP Liquor Scam Case) కీలక మలుపు తిరిగింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Former MLA Chevireddy Bhaskar Reddy) పీఏలు బాలాజీ, నవీన్‌ను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దుల్లోకి 8 కోట్ల 20 లక్షల రూపాయిలు సొమ్మును బాలాజీ తీసుకొచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి. అప్పట్లోనే ఈ సొమ్మును ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. మరోవైపు సిట్ బృందం వెంటాడుతుందనే భయంతో వీరిద్దరూ ఇండోర్ పారిపోయారు. అయితే ఇండోర్ నుంచి ఏపీలో వైసీపీ నేతలకు ఫోన్ చేస్తుండడంతో లోకేషన్ ఆధారంగా ఇండోర్‌కు వెళ్లాయి సిట్ బృందాలు.


సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇద్దరిని సిట్ బృందం ఇండోర్‌లో అదుపులోకి తీసుకుంది. గతంలో బాలాజీని పోలీసులు అరెస్టు చేశారని కోర్టులో వైసీపీ నేతలు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. తమ అదుపులో లేరని అప్పట్లోనే సిట్ బృందం కోర్టుకు తెలిపింది. ఇక అప్పటి నుంచి బాలాజీ, నవీన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన సిట్ ఎట్టకేలకు ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్పీకి వైసీపీ నేతల ఫిర్యాదు

తిరుపతిలో డెడ్‌బాడీల కలకలం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 04:30 PM