Share News

Atchannaidu: పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Nov 24 , 2025 | 10:17 AM

రైతులకు మేలు చూకూర్చేలా పంచ సూత్రాలను అమలు చేయబోతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.

Atchannaidu: పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు
Atchannaidu

అమరావతి, నవంబర్ 24: రైతులకు పంచసూత్రాల ద్వారా మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) అన్నారు. ఈరోజు (సోమవారం) కృష్ణా జిల్లా ఘంటసాలలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ.. నేటి నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు ఇంకా మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను అమలు చేయబోతున్నామన్నారు.


వచ్చే నెల 3న ప్రతి RSK పరిధిలో వర్క్‌షాపులు నిర్వహణ ఉంటుందని తెలిపారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్‌, ఫుడ్ ప్రాసెసింగ్‌, ప్రభుత్వ మద్దతు, రైతులకు అవగాహన కార్యక్రమాలే ప్రధాన అంశాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులందరికీ అవగాహన కల్పించేలా వర్క్‌ షాపులో దిశా నిర్దేశం చేస్తామన్నారు.


17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రైతన్న మీకోసం కార్యక్రమాలను రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుండి నడిపించాలని, ప్రతి రైతు సేవా కేంద్రంలో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

శ్రీశైలం దేవస్థానం పేరిట నకిలీ వెబ్‌సైట్ కలకలం

పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 24 , 2025 | 10:48 AM