Share News

Big Alert: ఆ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

ABN , Publish Date - Jul 30 , 2025 | 06:16 PM

భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో బుధవారం బ్యారేజీ వద్ద 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Big Alert: ఆ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
Prakasam Barrage, krishna river

అమరావతి, జులై 30: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో బుధవారం బ్యారేజీ వద్ద 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో బ్యారేజీ నుంచి నీటికి దిగువకు విడుదల చేయాలని వారు నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పందిస్తూ.. ప్రజలకు కీలక సూచనలు చేశారు. కృష్ణా నదిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున నదీ పరివాహక ప్రాంత (కృష్ణా, గుంటూరు జిల్లాలు) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా నదిలో ప్రయాణించ వద్దని చెప్పారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం కానీ, చేపలు పట్టడం వంటి పనులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే జంతువులను నదిలో వదిలేయ వద్దని చెప్పారు.


ఇంకా ఎండీ ప్రఖర్ జైన్ ఏమన్నారంటే..

  • కృష్ణా నది మీద ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ కోరారు.

  • బోట్లు, మోటర్ బోట్లు, పంట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.


  • మంగళవారం సాయంత్రం 7 గంటల నాటికి వివిధ ప్రాజెక్టులలోని వరద ప్రవాహం క్యూసెక్కుల్లో...

  • సుంకేశుల వద్ద ఇన్ ఫ్లో 1.25 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1.24 లక్షల క్యూసెక్కులు

  • శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 2.68 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2.91 లక్షల క్యూసెక్కులు


Updated Date - Jul 30 , 2025 | 06:46 PM