Share News

Minister Narayana Amravati Announcement: రాజధాని అమరావతి.. ఏం జరిగిందో చెప్పేసిన మంత్రి నారాయణ

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:53 AM

Minister Narayana Amravati Announcement: ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మంత్రి నారాయణ శాసనసభలో ముఖ్య విషయాలు తెలియజేశారు. అమరావతి విషయంలో గత ప్రభుత్వం చేసిన ఆకృత్యాలను, రాజధానిని ఎలా అడ్డుకుందనే విషయాన్ని సభ ముందు ఉంచారు నారాయణ.

 Minister Narayana Amravati Announcement: రాజధాని అమరావతి.. ఏం జరిగిందో చెప్పేసిన మంత్రి నారాయణ
Minister Narayana Amravati Announcement

అమరావతి, మార్చి 11: మూడు సంవత్సరాలలో అమరావతి (AP Capital Amaravati) నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ (Minister Narayana) సభ సాక్షిగా స్పష్టం చేశారు. ఏసీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా.. రాజధాని అమరావతి విషయంలో సభ్యులు సుజనా చౌదరి (MLA Sujaja chaudary) అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. అమరావతి పనుల పూర్తికి 64వేల 721 కోట్లతో ఎస్టిమేషన్ వేశామని.. టెండర్లు కొనసాగుతున్నాయని చెప్పారు. 2019-24లో వచ్చిన రాజకీయ అనిశ్చితి వల్ల అమరావతి నిర్మాణంలో ఇబ్బందులు వచ్చాయని చెప్పుకొచ్చారు. 2028కి రైతులకు ఇవ్వాల్సిన లే అవుట్‌లు వేసి ఇస్తామని తెలిపారు.


అమరావతి రాజధానిని 2014-19న నిర్ణయించినప్పుడు ఇదే సభలో వైఎస్ జగన్ ఆమోదం తెలిపారని... ప్రభుత్వం మారాక మూడుముక్కలాడారని మండిపడ్డారు. రాజధాని రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ లేకుండా భూములు ఇచ్చారని.. ఈ ఏడు, ఎనిమిది నెలలు హర్డిల్స్ అన్నీ దాటి టెండర్లను పిలిచామని చెప్పారు. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ 13400 కోట్లు మంజూరు చేసిందని.. కెఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు రూ.5 వేల కోట్లు ఇచ్చిందని.. అలాగే హడ్కో రూ.11 వేల కోట్లు ఇస్తోందని తెలిపారు. అంతేకాకుండా రూ.1560 కోట్లు కేంద్రం గ్రాంటు కింద ఇస్తోందని చెప్పుకొచ్చారు.


రాజధానిని మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. మెయిర్ రోడ్డులు 2 సంవత్సారాల్లో పూర్తి చేస్తామని.. ఎల్‌పీఎస్ రోడ్లు, డ్రైన్లు మూడు సంవత్సారాల్లో పూర్తి చేస్తామన్నారు. అమరావతి రాజధానికి జగన్ ముందు ఒప్పుకొని తరువాత ప్లేటు ఫిరాయించారని మండిపడ్డారు. దీంతో అయిదేళ్ల పాటు రైతులు సఫర్ అయ్యారన్నారు. అసెంబ్లీ, హైకోర్టు 3 సంవత్సారాల్లో పూర్తవుతాయని వెల్లడించారు. 136 ఆర్గనైజేషన్లుకు 1277 ఎకరాలు ఇచ్చామని.. గత అయిదేళ్ల పరిణామాల వల్ల కొందరు వెనెక్కి వెళ్లారని తెలిపారు. 31 ఆర్గనైజేషన్‌లకు 629.3 ఎకరాలకు అంగీకారం తెలిపామన్నారు. 13 సంస్ధలకు ఇచ్చిన భూములు రద్దు చేశామన్నారు. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రచ్చర్, రోడ్డు, స్ట్రామ్ వాటర్, వాకింగ్ ట్రాక్స్ వంటి ఫెసిలిటీస్‌తో ఉన్నాయన్నారు. 1280 ఎల్‌పీఎస్‌ రోడ్లకు టెండర్లు పిలిచామన్నారు. కొండవీటి వాగు, వాగు గ్రావీటీ కెనాల్‌లకు టెండర్లు పిలిచామన్నారు. మొత్తం 73 వర్కులకు రూ.64,721 కోట్లు ఎస్టిమేషన్ వేశామని... వీటిలో 62 పనులను టెండర్లు అయిపోయాయని చెప్పారు. గత ముఖ్యమంత్రి 50 వేల మందికి సెంటు లెక్కన ఇచ్చారన్నారు. ఆర్‌ఫైవ్ జోన్ క్రియేట్ చేశారని... వారికి ఆల్టర్నేట్ స్ధలం ఇచ్చి ఆ భూమిని కూడా తీసుకుంటామని మంత్రి నారాయణ సభలో పేర్కొన్నారు.


సుజనా చౌదరి ప్రశ్న ఇదే..

గత ప్రభుత్వం అరాచక పాలనలో అమరావతి నిర్వీర్యం ఒక భాగమన్నారు. భారత రాజ్యాంగాన్ని గత ప్రభుత్వం తుంగలోతొక్కిందని ఫైర్ అయ్యారు. ఇదే అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాపిటల్‌ను సెలెక్ట్ చేశారని.. రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లో తెలంగాణకు హైదరాబాద్‌ను.. ఏపీకి ఎలెక్టెడ్ గవర్నమెంట్ క్యాపిటల్‌ను నిర్ణయించుకోవచ్చని చెప్పారన్నారు. క్యాపిటల్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశామన్నారు. ఈ క్యాపిటల్ విషయంలో జగన్ చేసిన అరాచకానికి ఎవరు బాధ్యులో కూడా తేల్చాలన్నారు. అసలు క్యాపిటల్ విషయంలో చట్టాన్ని మార్చాలంటే లీగల్, ఫైనాన్స్ క్లియరెన్స్ ఎవరు ఇచ్చారని... క్యాబినెట్‌కు ఎవరు పెట్టారని అడిగారు. కోట్లాది రూపాయలు లాయర్లకు ఈ విషయంలో ఎవరు ఖర్చుపెట్టారని ప్రశ్నించారు. అమరావతి విషయంలో కాస్తా ఎమోషన్ అయ్యి న్యాయవాదులతో ఇక్కడ అన్యాయం జరుగుతోంది అని చెప్పానని.. మూడు పంటలు వచ్చే భూమిని సీఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో రైతులు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు పోరాడేటప్పుడు ఒక అంగుళం కూడా కదిలించలేరని చెప్పానని తెలిపారు.


‘నాకు 600 ఎకరాలు ఉన్నాయని నోటీసు ఇచ్చారు. అయితే నాకు, నా కుటుంబానికి ఇక్కడ అంగుళం కూడా లేదు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి కారణం ఎవ్వరో తెల్చాలి’ అని కోరారు. సీఆర్డీఏ చట్టంలో చేయాల్సిన పనులు చేశారా లేదా ... రాజ్యాంగాన్ని వయలేట్ చేశారన్నారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని హింసించారని.. అలాంటి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. 2013 రివైజ్డ్ ల్యాండ్ అక్విజేషన్ కోసం కొన్ని వేల కోట్లు ఇవ్వాల్సి వచ్చేదన్నారు. అందుకే రైతులకు న్యాయం చేయాలంటే సీఆర్డీఏ చట్టాన్ని, రేరా చట్టం పరిధిలోకి తేవాలన్నారు. నాన్ రివెన్యూ ఇన్కం వస్తే తప్ప రాష్ట్రం ముందుకు వెళ్లలేదని...హ్యబిటేషన్‌ను పెంచి యుటిలైజేషన్ పెంచకపోతే ఎలా అని ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

IT Raids: దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు ఐటి సోదాలు

Special Needs Schools: ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 11 , 2025 | 11:56 AM