kamineni Srinivas:కైకలూరు ఎమ్మెల్యేకి కొల్లేరు నేతలు కృతజ్ఞతలు.. ఎందుకంటే..
ABN , Publish Date - Apr 20 , 2025 | 09:42 PM
kamineni Srinivas: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు కొల్లేరు ప్రాంత నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కొల్లేరు సమస్యపై ఇంప్లీడ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోంది.

కైకలూరు, ఏప్రిల్ 20: కొల్లేరు శాశ్వత పరిష్కారానికి తొలి అడుగు పడిందని స్థానిక శాసన సభ్యులు కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. పర్యావరణాన్ని కాపాడుతూనే ప్రజలకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉన్నాయని తెలిపారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులతో, ప్రజలతో కామినేని శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోల్లేరు సమస్యపై ఇంప్లీడ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో.. ఎమ్మెల్యే కామినేనికి కొల్లేరు నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొల్లేరు గ్రామాల్లో ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. కొల్లేరు సమస్యపై ఎంపీ పుట్టా, ఎమ్మెల్యేలు చింతమనేని, ధర్మరాజు, రఘురామకృష్ణం రాజు, బడేటి రాధాకృష్ణ అందించిన సహకారం అభినందనీయమన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కొల్లేరులో పర్యటిస్తుందని ఆయన వివరించారు. గడిచిన 25 ఏళ్ల నుంచి పర్యావరణ వేత్తలు పర్యావరణం తప్ప మనుషుల గురించి పట్టించుకోలేదన్నారు.
కొల్లేరులో పక్షులు బతకాలి.. మనుషులు కూడా ముఖ్యమేనని ఆయన స్పష్టం చేశారు. మొదటి సారి కొల్లేరు ప్రాంతంలో ప్రజల మనుగడ గురించి హస్తినకు తెలియజేసిన ఘనత కుటమి ప్రభుత్వానిదేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ధర్మాసన ఇంప్లీడ్ పిటిషన్ విచారణ చేసి 12 వారాల్లో నివేదిక అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు.
ఇది కూడా చదవండి..
Lightning Strike: క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి
Minister Narayana: గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం
YSRCP: అధికారం కోల్పోయినా.. అరాచకాలు ఆగలేదు
10th class Students: సార్, ఛాయ్ తాగండి, నన్ను పాస్ చేయండి
CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..
CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి
CM Chandrababu: ధన్యవాదాలంటూ సీఎం చంద్రబాబు ట్వీట్.. ఎందుకంటే..
For Andhrapradesh News And Telugu News