Kakani Goverdhan Reddy: మాజీ మంత్రి కాకాణికి మరో కేసులో 14 రోజుల రిమాండ్..
ABN , Publish Date - Jun 19 , 2025 | 07:29 PM
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. మరో కేసులో నెల్లూరు రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎందుకంటే..

నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. మరో కేసులో నెల్లూరు రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికారిక టోల్ గేట్లు ఏర్పాటు చేసి అక్రమంగా నగదు వసూలుకు పాల్పడ్డారన్న కేసులో రైల్వే కోర్ట్ న్యాయమూర్తి జులై 3 వరకు రిమాండ్ విధించారు. ఇటీవల ముత్తుకూరు పీఎస్ లో నమోదైన కేసులొ కాకాణి మొదటి ముద్దాయిగా ఉన్నారు. కాసేపటి క్రితం రైల్వే కోర్టులో పోలీసులు ఆయనను హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం14 రోజుల రిమాండ్ విధించింది. విచారణ అనంతరం పోలీసులు కాకాణిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో కాకాణి టోల్‌గేట్‌ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై ముత్తుకూరు పీఎస్‌లో కేసు నమోదు కాగా కాకాణి ఏ1గా ఉన్నారు. అలాగే మరో పది మంది అనుచరులపై కూడా అధికారులు కేసు నమోదు చేశారు. కాకాణిని పీటీ వారెంట్‌పై రైల్వే కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. విచారణ అనంతరం ఆయనను తిరిగి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా.. మాజీ మంత్రి కాకాణి ఇప్పటికే మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఫొటోల మార్ఫింగ్ తదితర కేసుల్లో కాకాణి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
Also Read:
దమ్ము, ధైర్యం ఉంటే రా.. తేల్చుకుందాం.. జగన్‌కు గంటా శ్రీనివాసరావు సవాల్
విమాన ప్రమాదం.. కస్టమర్లకు ఎయిర్ ఇండియా సీఈఓ లేఖ..
For More Telugu News