SIT Investigation: వివేకా కేసులో సాక్షుల మరణాలపై సిట్ విచారణ వేగవంతం
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:26 PM
SIT Investigation: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారిని సిట్ విచారిస్తోంది.

కడప, ఏప్రిల్ 26: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో (Former Minister YS Viveka Murder Case) సాక్షులుగా ఉన్న వారు ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై సిట్ విచారణ (SIT Investigation) చేపట్టింది. ఇందులో భాగంగా వివేకా కేసు సాక్షుల్లో ఒకరైన కసునూరు పరమేశ్వర్ రెడ్డిని పులివెందుల్లో సిట్ పోలీసు అధికారులు ఈరోజు (శనివారం) విచారిస్తున్నారు. అలాగే ఈ కేసులో మరో కీలక సాక్షి మృతుడు రంగన్న భార్య సుశీలమ్మను విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
వివేకా హత్య కేసులో మొత్తం ఆరుగురు సాక్షులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కీలక సాక్షి అయిన రంగన్న మృతితో ఈ కేసును కూటమి ప్రభుత్వం (AP Govt) సీరియస్‌గా తీసుకుంది. వరుసగా సాక్షులు మృతి చెందుతుండటం.. ఎందుకు చనిపోతున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల చనిపోయిన రంగన్న కేసును పోలీసులు తిరగదోడుతున్నారు. రంగన్నకు ముందు వరుసగా ఐదుగురు సాక్షులు మరణించారు. దీంతో సాక్షుల వరుస మరణాలపై విచారణ నిమిత్తం ఇటీవల సిట్‌ను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. దీంతో గత కొంతకాలంగా పులివెందులలో సిట్ అధికారులు విచారిస్తున్నారు. వివేకా కేసులో సాక్షులుగా ఉన్న వారి మృతి వెనక మిస్టరీ ఏంటనే దానిపై సిట్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం పులివెందులలో సిట్ విచారణ కొనసాగుతోంది.
Karreguttalu Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోలు మృతి
మొదటగా.. మాజీ మంత్రి వివేకా హత్య జరిగిన సమయంలో సాక్షిగా ఉన్న కుసునూరు పరమేశ్వర్ రెడ్డి ఈరోజు సిట్ అధికారులు విచారిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా విచారించడంపై పరమేశ్వర్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు. అయినప్పటికీ అతడిని తీసుకువచ్చి పులివెందుల్లో విచారిస్తున్నారు. ఇతనితో పాటు ఇటీవల మృతి చెందిన కీలక సాక్షి రంగన్న భార్య సుశీలమ్మను కూడా విచారణకు పిలిపించింది సిట్. ఈ మేరకు సుశీలమ్మకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈరోజు సాయంత్రం విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఉదయం కుసునూరు పరమేశ్వర్ రెడ్డిని విచారిస్తున్న సిట్ అధికారులు.. సాయంత్రం రంగన్న భార్య సుశీలమ్మను విచారించనున్నారు. ఇక వీరిద్దరితో పాటు మున్ముందు ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారి బంధువులను, అనుమానస్పదంగా ఉన్నవారిని సిట్ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
BRS Vs Congress: మీ మౌనం దేనికి సంకేతం.. రాహుల్‌కు కవిత సూటి ప్రశ్న
Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం
Read Latest AP News And Telugu News