Sunil Kumar Yadav: అవినాష్ అనుచరుల వల్ల నాకు ప్రాణహాని..
ABN , Publish Date - Jun 22 , 2025 | 08:12 AM
kadapa Dist: పులివెందులలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్‌ను కొంతమంది వెంబడించారు. దీంతో ఆందోళన చెందిన సునీల్.. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Kadapa: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP YS Avinash Reddy) అనుచరులవల్ల తనకు ప్రాణహాని ఉందని వైఎస్ వివేకా (YS Viveka) హత్య కేసు ఏ2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ (Sunil Kumar Yadav) శనివారం రాత్రి పోలీసులను ఆశ్రయించాడు. పులివెందుల (Pulivendula) పట్టణ శివరుల్లో అవినాష్ అనుచరులు తమను కారులో వెంబడించినట్లు పోలీసుల (Police)కు ఫిర్యాదు (Complaint) చేశాడు. తన పెళ్ళి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా అవినాష్ అనుచరులు తమపై దాడికి ప్రయత్నించినట్లు సునీల్ కుమార్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అవినాష్ అనుచరుల హల్ చల్..
కడప జిల్లా పులివెందులలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులు శనివారం రాత్రి హల్ చల్ చేశారు. వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్‌ను వెంబడించారు. పులివెందులలో తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి తిరిగి వెస్తుండగా ఆయన కారును అవినాష్ అనుచరులు అనుసరించారు. దీంతో ఆందోళన చెందిన సునీల్ పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అవినాష్ అనుచరుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ డీఎస్పీకి విజ్ఞప్తి చేశాడు.
జైల్లో ఉన్నప్పుడు కూడా బెదిరించారు..
కాగా 2019 ఎన్నిలకు ముందు వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై వచ్చాడు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరాడు. వివేకా హత్య కేసులో ఇతర నిందితులు తనను జైల్లో బెదిరించారని తెలిపాడు. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత కూడా బెదిరింపులు వస్తున్నాయని సునీల్ యాదవ్ పేర్కొన్నాడు. తాను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చడం లేదని, వైసీపీ పెద్దల నుంచి తనకు ప్రాణహాని ఉందని సునీల్ ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా గతేడాది అక్టోబరులో అతనికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్
For More AP News and Telugu News