Share News

Kadapa MLA PA Cheating: పీఏ బాగోతం బట్టబయలు.. స్పందించిన కడప ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:58 PM

Kadapa MLA PA Cheating: ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను కడప ఎమ్మెల్యే పీఏ వాహిద్ మోసం చేసి రెండవ పెళ్లి చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం, డబ్బులు ఇస్తానని నమ్మించి సదరు మహిళను పెళ్లి చేసుకున్నాడు వాహిద్.

Kadapa MLA PA Cheating: పీఏ బాగోతం బట్టబయలు.. స్పందించిన కడప ఎమ్మెల్యే
Kadapa MLA PA Cheating

కడప, ఏప్రిల్ 28: కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి (Kadapa MLA Madhavi Reddy) పీఏ వాహిద్ (PA Vahid) బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకోవడం.. ఆపై వారిని వదిలేయడం పీఏకు పరిపాటిగా మారిపోయింది. ఇదే విధంగా ఓ మహిళను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్న వాహిద్.. ఇప్పుడు వద్దనడంతో తనకు న్యాయం చేయంటూ మహిళ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను కడప ఎమ్మెల్యే పీఏ వాహిద్ మోసం చేసి రెండవ పెళ్లి చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం, డబ్బులు ఇస్తానని నమ్మించి సదరు మహిళను పెళ్లి చేసుకున్నాడు వాహిద్. అయితే ఇదే విధంగా మరో ముగ్గురు అమ్మాయిలను ఎమ్మెల్యే పీఏ ట్రాప్ చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తమను మోసం చేసి పెళ్లి చేసుకుని.. ఇప్పుడు వద్దంటున్నాడని తెలిపింది. న్యాయం చేయాలని కోరినందుకు తన సోదరునిపై దాడి చేశాడని మహిళ వాపోయింది. ఈ వ్యవహారంపై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా తనకు న్యాయం జరగలేదని మహిళ పేర్కొంది. అంతేకాకుండా ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పీఏ వహీద్ తనను చెల్లిగా పరిచయం చేశాడని బాధితురాలు చెప్పుకొచ్చారు. తనకు న్యాయం చేయాలంటూ అర్ధరాత్రి ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఇంటి వద్దకు వెళ్లింది బాధితురాలు. మరోవైపు తీవ్రంగా గాయపడిన మహిళ సోదరుడు ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Revanth - Jana Reddy Meeting: జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. కారణమిదే


మరోవైపు పీఏ వాహిద్ వ్యవహారంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే పీఏ వాహిద్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఎమ్మెల్యే భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. వాహిద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే మాధవి సూచించారు. దీంతో ఈ వ్యహారంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం వాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇంకా ఎంత మంది మహిళలను వాహిద్ మోసం చేశారనే దానిపై కడప పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్

Visakhapatnam Mayor: విశాఖ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 02:27 PM