CID To AP High Court: విచారణకు రావాలని వేధించడం లేదు
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:55 AM
నటి కాదంబరి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారి కాంతిరాణా తాతా చేస్తున్న ఆరోపణలు నిరాధారమని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ హైకోర్టులో తెలిపారు. క్వాష్ పిటిషన్‌పై ఏప్రిల్ 28న తుది విచారణ జరగనుంది

కాంతిరాణా క్వాష్ పిటిషన్‌పై హైకోర్టుకు తెలిపిన సీఐడీ
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో తరచూ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని వేధిస్తున్నామన్న ఐపీఎస్ అధికారి కాంతిరాణా తాతా ఆరోపణల్లో వాస్తవం లేదని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. ఈ మధ్యకాలంలో విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇవ్వలేదన్నారు. కౌంటర్ దాఖలు చేశాక.. క్వాష్ పిటిషన్‌పై తుది విచారణ జరపాలని కోరారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేశారు.