Mohith Reddy Bail Plea: ఆ వ్యాజ్యాలు నేను విచారించను!
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:48 AM
జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ..

మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ లక్ష్మణరావు
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు తప్పుకొన్నారు. అలాగే, మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్ విషయంలో దాఖలైన ఏ వ్యాజ్యాన్నీ విచారించబోనని ఆయన ప్రకటించారు. కేసు ఫైలును ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు ఉంచి సాధ్యమైనంత త్వరగా వ్యాజ్యం మరో న్యాయమూర్తి ముందు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. మోహిత్‌రెడ్డిపై తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!