Jagan: ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించండి
ABN , Publish Date - Apr 21 , 2025 | 05:30 AM
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జగన్ ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ట్వీట్‌లో 'ముఖ్యమంత్రి' అనే పదాన్ని ఉపయోగించకపోవడం గమనార్హం.

అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నాడు ఎక్స్ వేదికగా హ్యాపీ బర్త్ డే చంద్రబాబుగారూ.. విషింగ్ యూ ఏ పీస్‌ఫుల్ అండ్ హెల్తీ లాంగ్ లైఫ్ అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఎక్కడ చంద్రబాబును ముఖ్యమంత్రిగా పేర్కొనకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.