Share News

Jagan Threatens Police: పోలీసుల బట్టలూడదీస్తాం

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:29 AM

జగన్ పోలీసులను హెచ్చరిస్తూ టీడీపీ నాయకుల‌కు వాచ్‌మెన్‌లుగా పని చేస్తున్న వారిని ఉద్యోగాలు పీకేస్తామంటూ హెచ్చరించారు. లింగమయ్య హత్య కేసులో పోలీసులపై ఆరోపణలు.

Jagan Threatens Police: పోలీసుల బట్టలూడదీస్తాం

వాళ్ల ఉద్యోగాలు పీకేస్తాం

జగన్‌ హెచ్చరిక

అనంతపురం/పుట్టపర్తి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘‘కొందరు పోలీసులు టీడీపీ నాయకులకు వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్నారు. వారి బట్టలూడదీస్తాం. గుర్తుపెట్టుకుని మరీ ఉద్యోగాలు పీకేస్తాం’’ అని మాజీ సీఎం జగన్‌ హెచ్చరించారు. శ్రీసత్యసాయిజిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పోలీసులను హెచ్చరిస్తూ నోరు పారేసుకున్నారు. లింగమయ్యపై 20 మంది దాడిచేస్తే ఇద్దరిపైనే కేసులు పెట్టారని, హత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే (పరిటాల సునీత), ఆమె కుమారుడు (శ్రీరాం)పై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ గురించి అనుచితంగా మాట్లాడారు. ‘‘సుధాకర్‌ అనేవాడు వీడియోకాల్‌ చేసి..ఎమ్మెల్యే, ఆమె కుమారుడితో మా ఎంపీటీసీలచేత మాట్లాడించాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..

అమ్మాయితో రాజకీయమా..

సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే

For More AP News and Telugu News

Updated Date - Apr 09 , 2025 | 04:29 AM