Jagan New Look: నుదుట బొట్టు.. తెల్ల గడ్డం
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:24 AM
నుదు ట సింధూరం బొట్టు.. తెల్లబడిన గడ్డంతో మా జీ సీఎం జగన్ కనిపించారు. మంగళవారం జరిగిన వైసీపీ పీఏసీ

ప్రభుత్వ వేధింపులపై ఫిర్యాదులకు యాప్
వివరాలు అప్‌లోడ్ చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ సీఎం సూచన
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): నుదు ట సింధూరం బొట్టు.. తెల్లబడిన గడ్డంతో మా జీ సీఎం జగన్ కనిపించారు. మంగళవారం జరిగిన వైసీపీ పీఏసీ సమావేశం దీనికి వేదికైం ది. సహజంగా పురోహితులు తలపై అక్షింతలు వేస్తే వెంటనే దులిపేసుకుంటారు. బొట్టు పెడి తే తుడిపేస్తారు. అలాంటిది పీఏసీ భేటీకి ముందు పురోహితుడు తనకు పెట్టిన సిం దూరాన్ని అలాగే ఉంచుకుని సమావేశానికి రావడం వైసీపీ నేతలకూ ఆశ్చర్యం కలిగించిం ది. అలాగే ఎప్పుడూ నల్లని గడ్డం.. నల్లని జుత్తుతో కనిపించే జగన్.. మంగళవారం తెల్ల గడ్డంతో కనిపించడం ఆసక్తి రేపింది. ఇక ఈ సమావేశంలో ఆయన యథావిధిగా రాష్ట్రంలోని శాంతిభద్రతలు లేవని ధ్వజమెత్తారు. వైసీపీ శ్రేణులపై దాడులు పెరిగిపోతున్నాయని.. ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా.. అకారణంగా పోలీసు కేసులు పెట్టినా.. పార్టీ రూపొందించిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలని జగన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News