Jagan Mohan Reddy: వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్.. వెనక్కి తగ్గిన జగన్
ABN , Publish Date - Nov 11 , 2025 | 07:58 PM
మాజీ సీఎం జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జగన్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో వ్యక్తి గత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న మోమోను జగన్ తరఫు న్యాయవాది వెనిక్కి తీసుకున్నారు.
హైదరాబాద్, నవంబర్ 11: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జగన్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో వ్యక్తి గత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న మోమోను జగన్ తరఫు న్యాయవాది వెనిక్కి తీసుకున్నారు. కొంత సమయం ఇస్తే వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారని చెప్పారు.
ఇందుకోసం వారం రోజులు సమయం ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోరగా.. ఈనెల 21 వరకు న్యాయస్థానం సమయం ఇచ్చింది. యూరప్ పర్యటనకు వెళితే ఈ నెల 14వరకు కోర్టుకు హాజరు కావాలని గతంలోనే సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
సీఎంతో కేంద్ర మంత్రి భేటీ.. మొంథా తుఫాన్‌పై చర్చ
అన్ని పార్టీ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తాం: నారా లోకేష్