CBI court order: జగన్ అక్రమాస్తుల కేసు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశం
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:50 PM
మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తి గత హాజరుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (CBI)కి న్యాయస్థానం ఆదేశించింది. CBI court order: జగన్ అక్రమాస్తుల కేసు.. కౌంటర్ ధాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశం
అమరావతి, నవంబర్ 10: ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తి గత హాజరుపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (CBI)కి న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 14 లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని గతంలో జగన్ ను సీబీఐ కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఇచ్చిన గడువు సమీపిస్తుండడంతో CBI కోర్టులో ఇటీవల జగన్ మెమో దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు మినహయించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కోర్టు అనుమతిస్తే తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జగన్ దాఖలు చేసిన మెమోపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.