Share News

Inter Students: ఇద్దరు ఫస్టియర్‌ విద్యార్థుల బలవన్మరణం

ABN , Publish Date - Apr 13 , 2025 | 05:04 AM

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన ఇద్దరు విద్యార్థులు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక విద్యార్థి కర్నూలు జిల్లా బండిఆత్మకూరులో, మరొకరు నెల్లూరు రూరల్‌ మండలంలో మృతి చెందారు

Inter Students: ఇద్దరు ఫస్టియర్‌ విద్యార్థుల బలవన్మరణం

బండిఆత్మకూరు, నెల్లూరురూరల్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన ఇద్దరు విద్యార్థు లు బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లా బండిఆత్మకూరు ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న పెద్ద మౌళాలి కుమారుడు చిన్నమస్తాన్‌ నంద్యాలలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ హెచ్‌ఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. శనివారం విడుదలైన ఫలితాల్లో చిన్నమస్తాన్‌ ఫెయిల్‌ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే నెల్లూరు రూరల్‌ మండలం చింతారెడ్డిపాలెంలో మరో ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఎంపీసీలో ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు.

Updated Date - Apr 13 , 2025 | 05:06 AM