Share News

India Justice Report 2025: మూడేళ్లలో ఏపీ పోలీసుల్లో 33 Per మహిళలు

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:45 AM

ఇండియా జస్టిస్‌ నివేదిక-2025 ప్రకారం దేశంలోని ఏ రాష్ట్రం 33% మహిళా పోలీసుల కోటాను పూర్తి చేయలేదు.ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ మాత్రమే మూడేళ్లలో కోటా సాధించే అవకాశం ఉందని, ఇతర రాష్ట్రాలకు 24 నుంచి 200 ఏళ్ల వరకు పడుతుందని నివేదికలో తెలిపింది.

India Justice Report 2025: మూడేళ్లలో ఏపీ పోలీసుల్లో 33 Per మహిళలు

  • మిగతా రాష్ట్రాలు 24 ఏళ్లకు గానీ కోటా చేరుకోలేవు

  • ఇండియా జస్టిస్‌ నివేదిక-2025 వెల్లడి

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): పోలీసు వ్యవస్థలో మహిళా రిజర్వేషన్‌ కోటా 33 శాతాన్ని ఇప్పటి వరకు ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం కూడా సాధించలేదని ఇండియా జస్టిస్‌ నివేదిక-2025 వెల్లడించింది. మరో మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో 33 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. అదే సమయంలో మిగతా రాష్ట్రాలు ఈ కోటాను పూర్తిగా అమలు చేయడానికి కనీసం మరో 24 ఏళ్లు అవుతుందని, జార్ఖండ్‌, త్రిపుర, అండమాన్‌-నికోబార్‌కు అయితే 200 ఏళ్లు పడుతుందని పేర్కొంది.

నివేదికలోని వివరాలు

  • దేశవ్యాప్తంగా 17 శాతం పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు, 30 శాతం స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌లు లేవు.

  • పోలీసు వ్యవస్థలో లింగ వివక్ష అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయి పోస్టుల్లో ఉన్న మహిళలు 8 శాతం మాత్రమే. ఏపీలో జాతీయ సగటు కంటే కూడా తక్కువగా ఉంది. ఏపీలో సగటున పోలీసు స్టేషన్‌కు మహిళా ఎస్‌ఐలు 0.2 శాతం, మహిళా కానిస్టేబుళ్లు 2.5 శాతం మాత్రమే.

  • ఏపీలో మొత్తం పోలీసు ఉద్యోగుల్లో మహిళలు 21.5 శాతం, పోలీసు అధికారుల్లో 5.2 శాతం, జైలు ఉద్యోగుల్లో 8.4 శాతం ఉన్నారు.

  • న్యాయవ్యవస్థలో పెండింగ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. బిహార్‌లో మూడేళ్ల నుంచి పెండింగ్‌ కేసులు 71 శాతం ఉన్నాయి.


  • ఏపీలో కింది కోర్టుల్లో మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులు 33.5 శాతం. హైకోర్టులో ఐదేళ్ల నుంచి పెండింగ్‌ కేసులు 50.7 శాతం, 10-20 ఏళ్లలో పెండింగ్‌లో ఉన్నవి 26.7 శాతం, 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నవి 22.5 శాతం ఉన్నాయి.

  • 10 లక్షల మంది ప్రజలకు 50 మంది జడ్జిలు అవసరం కాగా, ప్రస్తుతం 15 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. ఏపీలో జడ్జి, ప్రజల నిష్పత్తి10.5 శాతంగా ఉంది. ఇది 50 శాతం ఉండాలి.

  • జిల్లా న్యాయస్థానాల్లో మహిళా జడ్జిలు 38 శాతం ఉన్నారు.

  • ఏపీ హైకోర్టు జడ్జిల్లో మహిళలు 16.7 శాతం, సబ్‌కోర్టుల్లో 50.9 శాతం ఉన్నారు.

  • పోలీసు, న్యాయ వ్యవస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాను అమలు చేసిన ఏకైక రాష్ట్రం కర్ణాటక.

  • దేశవ్యాప్తంగా మహిళా పోలీసుల్లో 89 శాతం మంది కానిస్టేబుల్‌ స్థాయిలోనే ఉన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 05:47 AM