Share News

IMD Alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్‌డీ హెచ్చరిక.. వారం రోజులు భారీ వర్షాలు..

ABN , Publish Date - Jul 18 , 2025 | 08:24 AM

IMD Alert: భారత వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అంతేకాదు.. రానున్న ఐదు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంది.

IMD Alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్‌డీ హెచ్చరిక.. వారం రోజులు భారీ వర్షాలు..
IMD Alert

రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నిన్న (గురువారం) భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. మరో వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అంతేకాదు.. రానున్న ఐదు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంది.


ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.


తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలోని 8 జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంది.


ఇవి కూడా చదవండి

నడిరోడ్డుపై పాము, ముంగిస పోరు.. గెలుపు దేనిదంటే..

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..

Updated Date - Jul 18 , 2025 | 08:26 AM