Share News

AP High Court: తోపుదుర్తిపై తొందరపాటు చర్యలు వద్దు

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:32 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సత్యసాయి జిల్లాలో పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో రామగిరి పోలీసులు నమోదు చేసిన కేసును

AP High Court: తోపుదుర్తిపై తొందరపాటు చర్యలు వద్దు

అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సత్యసాయి జిల్లాలో పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో రామగిరి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పోలీసుల తరఫున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నీలోత్పల్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత కేసులో పిటిషనర్‌పై నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనన్నారు. తోపుదుర్తి తరఫున న్యాయవాది సాయిశరణ్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ను అరెస్టు చేస్తారనే ఆందోళన ఉందన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు పిటిషనర్‌ విషయంలో రెండు వారాలపాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్నారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

Updated Date - Jul 30 , 2025 | 05:45 AM