Kodali Nani: కొడాలి నాని ఆరోగ్యం ఇప్పుడెలా ఉందంటే..
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:16 PM
Kodali Nani Health: మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతిలో ఉన్న కొడాలి నాని ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు ఆయన కుటుంబ సభ్యులు.

అమరావతి, ఏప్రిల్ 21: మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతిలో ఉన్న కొడాలి నాని ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు ఆయన కుటుంబ సభ్యులు. కొడాలి నాని ఆరోగ్యం కాస్త కుదిటపడిందని ప్రకటించారు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నానికి గుండె ఆపరేషన్ నిర్వహించారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కొంతకాలం తరువాత ఆయన్న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కూడా ఆ ఆస్పత్రిలోనే నాని ఉన్నారు. హార్ట్ రీహాబిలిటేషన్ తీసుకొంటున్నారని నాని అనుచరులు చెబుతున్నారు.
కొడాలి నాని కొద్ది రోజుల క్రితం తన ఇంట్లో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు తేల్చారు. ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, ఇప్పుడే ఆ అవసరం లేదని.. కొంత కాలం ఆగిన తరువాత కూడా వేయించుకోవచ్చని వైద్యులు తెలిపారు. దీంతో నాని.. తన ఇంటికి వచ్చేశారు. ఇంటికొచ్చాక మళ్లీ అదే పరిస్థితి ఎదురవ్వడంతో.. ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో నాని చూపించుకున్నారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు.. ఆయనకు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆ వెంటనే నానికి ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. కొన్ని రోజుల తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కొడాలి.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఉన్నారు. కొడాలి నాని ప్రస్తుతం కోలుకున్నారని.. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు తిరిగొస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Also Read:
మాజీ డీజీపీ హత్య కేసులో ట్విస్ట్..
భారత్‌లో 6 రాష్ట్రాలపై ఆస్ట్రేలియా వీసా ఆంక్షలు
లైఫ్‌లో ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఎంత డబ్బు
For More Andhra Pradesh News and Telugu News..