Health Minister: ఉద్యోగ నేతలకు బదిలీల్లో మినహాయింపు ఎలా
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:36 AM
ఆరోగ్యశాఖ పరిధిలో జరిగే సాధారణ బదిలీల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు మినహాయింపులిచ్చే విషయం

నివేదిక కోరిన ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖ పరిధిలో జరిగే సాధారణ బదిలీల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు మినహాయింపులిచ్చే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. మంత్రిత్వ శాఖ పరిధిలో ఇటీవల చేపట్టిన బదిలీల్లో 7,100 మందికి పైగా సిబ్బంది బదిలీ అయ్యారు. మరో 800 మందికి పైగా తమ పాత స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరిలో సింహభాగం ఉద్యోగ సంఘాల ప్రతినిధులే ఉన్నారు. జీఏడీ మార్గదర్శకాల ప్రకారం గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఒకేచోట తొమ్మిదేళ్లు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ మినహాయింపును ఒకే విడతలో ఇవ్వాలా, వేర్వేరు కాలాలకు అన్వయించాలా అన్న అంశంపై స్పష్టత కొరవడడంతో, దీన్ని ఆసరాగా తీసుకొని కొందర ప్రతినిధులు 15-20 ఏళ్ల పాటు ఒకేచోట పని చేస్తుండటంపై అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియకు సంబంధించి అమలులో ఉన్న నియమాలు, మార్గదర్శకాలను పరిశీలించి, అవి దుర్వినియోగం కాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!