Share News

CBI Investigation: 5 లక్షలు జమ చేసేందుకు సమయం ఇవ్వండి

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:03 AM

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మరణంపై సీబీఐ, జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్‌, కేఏ పాల్‌ వేసిన పిల్స్‌ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి

CBI Investigation: 5 లక్షలు జమ చేసేందుకు సమయం ఇవ్వండి

  • హైకోర్టును అభ్యర్థించిన హర్షకుమార్‌

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మరణంపై సీబీఐ, జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్‌, కేఏ పాల్‌ వేసిన పిల్స్‌ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తుపై ధర్మాసనం ఆరా తీసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్‌.ప్రణతి స్పందిస్తూ.. కేసు దర్యాప్తు చివరి దశకు చేరిందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రవీణ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసేందుకు పిటిషనర్ల వద్ద ఏమి ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించింది. హర్షకుమార్‌ కోరిన విధంగా రూ. 5 లక్షలు జమ చేసేందుకు సమయం ఇచ్చింది.


తదుపరి విచారణ నాటికి దర్యాప్తు వివరాలను కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. విచారణను సెప్టెంబరు 17కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. పాస్టర్‌ ప్రవీణ్‌ మరణంపై కేఏ పాల్‌, హర్షకుమార్‌ హైకోర్టులో వేసిన పిల్స్‌ సదుద్దేశంతో వేశారని నిరూపించుకొనేందుకు రూ. 5 లక్షలు చొప్పున జమచేయాలని గతంలో ఆ ఇద్దరినీ ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - Jun 26 , 2025 | 06:03 AM