Tribute: కోడెల శివప్రసాదరావుకు మంత్రి లోకేష్ నివాళి..
ABN , Publish Date - May 02 , 2025 | 10:53 AM
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రిగా పనిచేసిన కోడెల శివప్రసాదరావు (72) జయంతి సందర్భంగా ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ నాయుడు ఘనంగా నివాళులర్పించారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు (TDP Senior Leader), నవ్యాంధ్ర తొలి శాసనసభ స్పీకర్ (Speaker), మాజీ మంత్రి స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు (Kodela Sivaprasad Rao) జయంతి (Jayanthi) సందర్భంగా ఆయన స్మృతికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఘనంగా నివాళులు (Tribute) అర్పించారు. వైద్యునిగా, తిరుగులేని నాయకుడిగా ఆయన ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి పల్నాటి పులిగా పేరుగడించారన్నారు. తెలుగుదేశం పార్టీకి కోడెల శివప్రసాదరావు చేసిన సేవలు మరువలేనివని.. ఆయన చేసిన మంచి పనులతో ప్రజల హృదయాల్లో నిలిచే ఉన్నారని అన్నారు. ఆ ప్రజానేత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని మంత్రి లోకేష్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రిగా పనిచేసిన కోడెల శివప్రసాదరావు (72) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో వెంటిలేటర్‌కు ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2019లో అధికారంలోకి వచ్చీ రాగానే జగన్ పదవిలో కూర్చున్నది మొదలు... కక్ష సాధింపులు.. తొలి ఆరు నెలల్లోనే... ఆత్మహత్య చేసుకునే స్థాయిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వేధింపులు, కేసులు మొదలయ్యాయి. అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అధికారం అంతానికి వచ్చేసరికి... చంద్రబాబు అరెస్టు.. మధ్యలో... ఎంత మందిపై తప్పుడు కేసులు పెట్టారో, ఎన్ని రకాలుగా వేధించారో లెక్కే లేదు.
Also Read: గొర్రెల స్కామ్.. దళారి మొయినుద్దీన్ అరెస్ట్..
పులిలా బతికారు..
కోడెల శివప్రసాదరావు పులిలా బతికారు. భయమన్నది ఎరగని వ్యక్తి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయనను హింసిచడం మొదలుపెట్టింది. ఎన్నో కేసులు పెట్టింది. అవమానించింది. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ఆయన చొరవ చూపారు. కోటప్పకొండను ఆయన గొప్పగా అభివృద్ధి చేశారు. పార్టీకి ఎనలేని సేవ చేశారు. ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న ఆయన అవమానాలను మాత్రం తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం..
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట
For More AP News and Telugu News