Share News

Guntur: నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:47 AM

గుంటూరు మేయర్‌గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర గెలుపొందరు. నిన్నటి వరకు ఏ పార్టీ అభ్య ర్థి పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవం అనుకున్నారు. అయితే సోమవారం ఉదయం వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి పోటిలో నిలిచారు. దీంతో ఎన్నిక జరగ్గా.. కూటమి అభ్యర్థి విజయం సాధించారు.

Guntur: నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
Guntur Mayor Kovelmudi Ravindra

గుంటూరు జిల్లా: గుంటూరు మేయర్‌ (Guntur Mayor) ఎన్నికలో (election) కూటమి అభ్యర్థిగా (Kutami candidate) పోటీ చేసిన కోవెలమూడి రవీంద్ర (Kovelmudi Ravindra) గెలుపొందారు. (Elected) ఈ మేరకు అధికారులు ప్రకటించారు. కావటి మనోహర్‌నాయుడు రాజీనామాతో ఖాళీ అయిన మేయర్‌ పదవికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక నిర్వహించారు. కూటమి తరఫున మేయర్‌ అభ్యర్ధిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలిచారు. అధికారులు ఈరోజు ఎన్నిక నిర్వహించారు. కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.

Also Read: హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...


కావటి మనోహర్‌నాయుడు రాజీనామాతో ఖాళీ అయిన గుంటూరు మేయర్‌ పదవికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం అధికారులు ఎన్నిక నిర్వహించారు. కూటమి తరఫున మేయర్‌ అభ్యర్ధిగా కోవెలమూడి రవీంద్ర , వైసీపీ అభ్యర్థిగా 30వ డివిజన్ కార్పోరేటర్ అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలిచారు.అయితే నిన్నటి వరకు అంతా ఏకపక్షమే అని భావించినప్పటికీ చివరి నిమిషంలో వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డి సోమవారం ఉదయం నామినేషన్ వేశారు. దీంతో కూటమి నేతలు కూడా అప్రమత్తమయ్యారు. ఇరు పార్టీలు తమ సభ్యులకు విప్‌ జారీ చేశాయి. అయితే కౌన్సిల్‌లో కూటమికే ఆధిక్యం ఉంది. దీంతో మేయర్‌ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. అయితే గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉండగా.. టీడీపీకి 9, జనసేనకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. మామూలుగా అయితే వైసీపీ గెలవడం పక్కా. కానీ ఇక్కడే ట్విస్టు ఏంటంటే.. ఇటీవల జరిగిన సాధారణ (2024) ఎన్నికల్లో దాదాపు 19 మంది కార్పొరేటర్లు వైసీపీకి టాటా చెప్పేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరారు. దీంతో వైసీపీ బలహీనపడగా.. కూటమి బలం పెరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్నికలో కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

మీ ఇంట్లో ఏపీ ఉందా.. అయితే ఈ జాగ్రర్తలు పాటించండి..

For More AP News and Telugu News

Updated Date - Apr 28 , 2025 | 12:00 PM