Share News

Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్

ABN , Publish Date - Apr 28 , 2025 | 10:52 AM

Guntur Mayor Election: గుంటూరు నగర్ మేయర్ వైసీపీ అభ్యర్థిగా 30వ డివిజన్ కార్పోరేటర్ అచ్చాల వెంకటరెడ్డి ఈరోజు (సోమవారం) ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కూటమి మేయర్ అభ్యర్థిగా 37వ డివిజన్ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర బరిలో ఉన్నారు.

Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్
Guntur Mayor Election

గుంటూరు, ఏప్రిల్ 28: గుంటూరు మేయర్‌ ఎన్నికపై (Guntur Mayor Election) ఉత్కంఠకు తెరపడింది. నిన్నటి వరకు ఏకపక్షమే అని భావించిన మేయర్‌ ఎన్నికల్లో వైసీపీ ఎంట్రీ ఇచ్చింది. గుంటూరు మేయర్ ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది వైసీపీ. ఈ క్రమంలో గుంటూరు నగర్ మేయర్ వైసీపీ అభ్యర్థిగా 30వ డివిజన్ కార్పోరేటర్ అచ్చాల వెంకటరెడ్డి ఈరోజు (సోమవారం) ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కూటమి మేయర్ అభ్యర్థిగా 37వ డివిజన్ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర బరిలో ఉన్నారు. ఇప్పటికే రవీంద్ర కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే నిన్నటి వరకు అంతా ఏకపక్షమే అని భావించినప్పటికీ చివరి నిమిషంలో వైసీపీ ట్విస్ట్ ఇవ్వడంతో టీడీపీ నేతలు కూడా అప్రమత్తమయ్యారు.


గుంటూరు మేయర్‌ ఎన్నికల్లో పోటీకి వైసీపీ సై అనడమే కాకుండా అభ్యర్థితో నామినేషన్ కూడా దాఖలు చేయించింది. ఈరోజు ఉదయం 11 గంటలకు గుంటూరు నూతన మేయర్ ఎన్నిక జరుగునుంది. తాజాగా వైసీపీ అభ్యర్థి బరిలోకి దిగడంతో మేయర్‌ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.మేయర్ ఎన్నికపై వైసీపీ విప్ కూడా జారీ చేసింది. అలాగే కూటమి కూడా తమ పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థిని గెలిపించుకునేందుకు విప్ జారీ చేసింది. అయితే గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీకి 46 మంది కార్పొరేటర్ల బలం ఉంది. అలాగే టీడీపీకి 9, జనసేనకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. మామూలుగా అయితే వైసీపీ గెలవడం పక్కా. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో దాదాపు 19 మంది కార్పొరేటర్లు వైసీపీకి టాటా చెప్పేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరారు. దీంతో వైసీపీ బలహీనపడగా.. కూటమి బలం పెరిగింది.

Viral Video: విరాట్, రాహుల్ మధ్య మాటల యుద్ధం.. నువ్వా నేనా, చివరకు ఏమైందంటే..


అలాగే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మేయర్ పదవికి కావటి మనోహర్ కూడా రాజీనామా చేశారు. దీంతో మేయర్ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. కొత్త మేయర్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటఫికేషన్ జారీ చేసింది. మొదట ఈ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంటుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో మేయర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిని బరిలోకి దించారు. ఈ ఎన్నికల్లో కూటమికి 34 మంది సభ్యుల మెజార్టీ ఉండగా.. వైసీపీకి కేవలం 29 మంది సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ పోటీలోకి దిగినప్పటికీ కోవెలమూడి రవీంద్ర ఎన్నిక లాంఛనమే అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 11 గంటలకు జరిగే మేయర్ ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో జరుగనున్న సమావేశంలో నూతన మేయర్‌ను ఎన్నుకోనున్నారు. మేయర్‌ ఎన్నికకు సభ్యులు మినహా ఇతరులెవరూ కూడా లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. అలాగే జీఎంసీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌‌ను అమలులో ఉండనుంది.


ఇవి కూడా చదవండి

Vastu Tips: ఇంట్లో నీటి కుండను ఏ దిశలో ఉంచితే అదృష్టం.. ఎక్కడ ఉంచకూడదు..

Fire Incident: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 11:01 AM