AP Logistics: ఏపీ-లింక్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో భారీ పెట్టుబడులు రావాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:59 PM
ఏపీ-లింక్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. మొత్తంగా ఐదు రంగాలను ఈ కార్పొరేషన్ అనుసంధానించనుంది.
ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AP Link) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ-లింక్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. మొత్తంగా ఐదు రంగాలను ఈ కార్పొరేషన్ అనుసంధానించనుంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, అంతర్గత జలరవాణా, గిడ్డంగులను అనుసంధానిస్తూ లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడంపై ఈ ఏపీ-లింక్ దృష్టి పెట్టబోతోంది (AP Logistics Infrastructure Corporation).
రాష్ట్రంలోని లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు, సమన్వయం, పర్యవేక్షణకు ఏపీ లింక్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ కార్పొరేషనుకు ఒక ఎండీతో పాటు, వివిధ అనుబంధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సేవలిందిస్తారు. అలాగే సలహా కమిటీని, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను అమలు చేయడానికి జిల్లా స్థాయి సెల్స్ ఏర్పాటు చేయనున్నారు (AP CM Chandrababu Naidu).
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే హోల్డింగ్ కంపెనీ తరహాలో ఏపీ-లింక్ వ్యవహరించనుంది. ఏపీ లింక్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చూడాలని (logistics infrastructure AP), అలాగే క్షేత్ర స్థాయిలో వివిధ రంగాలకు అవసరమైన లాజిస్టిక్స్ అందించే విషయంలో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
ఉగాదిలోగా 5 లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి పార్థసారథి
ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే
Read Latest AP News And Telugu News