Share News

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు మంత్రుల కమిటీ

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:38 AM

గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది.

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు మంత్రుల కమిటీ

  • కమిటీలో ఆర్థిక సహా 12 శాఖల మంత్రులు

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. 12 మంది మంత్రులను కమిటీలో నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవదాయ, జలవనరుల, హోం, మున్సిపల్‌, రెవెన్యూ, పర్యాటక, కార్మిక, రవాణా, ఆరోగ్య, ఆర్‌ అండ్‌ బీ, విద్యుత్‌, ఆర్థిక శాఖల మంత్రులను కమిటీలో సభ్యులుగా నియమించారు. దేవదాయ శాఖ కార్యదర్శి కమిటీ మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారు. మంత్రుల కమిటీ సభ్యులు గోదావరి పుష్కరాలు సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు విధానాలు రూపొందించడంతో పాటు సలహాలు, సూచనలు ఇవ్వాలి. దేవదాయ శాఖ కార్యదర్శి మంత్రుల కమిటీతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా శాఖల కార్యదర్శులు కూడా మంత్రులకు సపోర్టుగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 06:38 AM