Share News

Governor Abdul Nazir: సేవా భావంతో సమాజాన్ని నడిపించాలి

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:08 AM

సేవా భావంతో సమాజాన్ని ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పిలుపు నిచ్చారు.

Governor Abdul Nazir: సేవా భావంతో సమాజాన్ని నడిపించాలి

  • రెడ్‌క్రాస్‌ వార్షిక సమావేశంలో గవర్నర్‌ నజీర్‌

విజయవాడ సిటీ, జులై 7(ఆంధ్రజ్యోతి): సేవా భావంతో సమాజాన్ని ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పిలుపు నిచ్చారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ వార్షిక సమావేశం బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. శాఖ అధ్యక్షుడు, గవర్నర్‌ నజీర్‌ మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని కొనియాడారు. విజయవాడ వరద బాధితులకు ఎనలేని సేవ చేసిందని అభినందించారు. అనంతరం రెడ్‌ క్రాస్‌ సభ్యతాలను అత్యధికంగా చేయించిన ఏపీ జెన్‌కో ఎండీ గిరీషా, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ స్విప్నిల్‌ దిన్‌కర్‌లను అభినందిస్తూ, వారికి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ వై.డి.రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 05:08 AM