Polavaram Flood Risk: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:14 AM
గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు

పోలవరం, జూలై 23(ఆంధ్రజ్యోతి): గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి నీటి మట్టం పెరగడం ఈ నెలలో ఇది రెండోసారి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు, కొండవాగులు పొంగిపొర్లుతూ గోదావరికి వరద చేరుతోంది. దీంతో పోలవరంలో నీటిమట్టం బుధవారం నాటికి మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి వస్తున్న 1,57,649 క్యూసెక్కుల వరదను స్పిల్‌వే 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!