Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బెయిల్
ABN , Publish Date - Jun 30 , 2025 | 08:16 PM
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. గుంటూరు జిల్లా కోర్టు నందిగంకు బెయిల్ మంజూరు చేసింది. టిడిపి కార్యకర్త ఇసుక పల్లి రాజుపై దాడి కేసులో అరెస్ట్ అయిన సురేశ్, ఇప్పటివరకూ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

గుంటూరు: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. గుంటూరు జిల్లా కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో అరెస్టయిన సురేశ్, గుంటూరు జిల్లా జైలులో ఇప్పటివరకూ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మాజీ ఎంపీ నందిగం సురేశ్, అతని సోదరుడు నందిగం వెంకట్‌తో కలిసి ఇటీవల తన స్వగ్రామం తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో టీడీపీ కార్యకర్తపై తీవ్రస్థాయిలో దాడికి దిగారు. ఈ దాడిలో ఇసుకపల్లి కృష్ణ అలియాస్ రాజుని తీవ్రంగా గాయపరిచారు.
అంతేకాకుండా, తీవ్రంగా గాయపడ్డ రాజును అంతటితో వదిలేయకుండా ఇంటికి తీసుకువెళ్లి బంధించారు. ఇక, ఇంటి వద్ద సురేశ్ భార్య బేబి, తదితరులు కూడా రాజుని రాళ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. దీంతో రాజు భార్య చేసిన ఫిర్యాదు మేరకు నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం సురేశ్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జిల్లా కోర్టు ఇవాళ(సోమవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజాసింగ్‌పై అగ్ర నాయకత్వం సీరియస్
లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..
పాశమైలారంలో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసులు మోహరింపు
Read Latest Telangana News And Telugu News