Share News

Gorantla Release: సెంట్రల్‌ జైలు నుంచి మాధవ్‌ విడుదల

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:55 AM

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టులు చేసినా వైసీపీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని, జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన అన్నారు

Gorantla Release: సెంట్రల్‌ జైలు నుంచి మాధవ్‌ విడుదల

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు చేసిన అక్రమ అరెస్టులు, రాజకీయ హత్యలు.. వైసీపీ కేడర్‌ను గానీ, తమ లీడర్‌ను గానీ ఏమీ పీకలేవని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. ‘రాజమండ్రి సెంట్రల్‌ జైలు సాక్షిగా చెబుతున్న.. ఈ రా ష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి ఎదురులేదు, జగన్‌ మరోమారు సీఎం అవుతారనడంలో సందేహం లే దు’ అని చెప్పారు. చేబ్రోలు కిరణ్‌కుమార్‌పైన, పోలీసులపైన దాడి కేసుల్లో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్ర ల్‌ జైలులో ఉన్న ఆయన మంగళవారం రాత్రి బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు వెలుపల మాట్లాడుతూ.. ఈసారి కూటమి గెలవదని, వైసీపీ ఓడదని అన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 04:56 AM