APSRTC: ‘ఉచిత ప్రయాణం’ కోసం 2 వేల బస్సులు కొనాలి
ABN , Publish Date - Jun 25 , 2025 | 06:20 AM
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే 2వేల బస్సులు కొనుగోలు చేయాలని, 10 వేల మంది సిబ్బందిని నియమించాలని ఏపీఎ్‌సఆర్టీసీ

10 వేల మంది సిబ్బందిని నియమించాలి: ఈయూ
విజయవాడ (బస్ స్టేషన్), జూన్ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే 2వేల బస్సులు కొనుగోలు చేయాలని, 10 వేల మంది సిబ్బందిని నియమించాలని ఏపీఎ్‌సఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు పలిశెట్టి దామోదరావు అన్నారు. మంగళవారం విజయవాడలోని యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆయన మాట్లాడారు.