Kadiyam: 500 కిలోల ధాన్యంతో చంద్రబాబు ముఖచిత్రం
ABN , Publish Date - Apr 21 , 2025 | 05:16 AM
కడియం రైతులు 500 కిలోల ధాన్యంతో సీఎం చంద్రబాబు ముఖచిత్రాన్ని రూపొందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమం ప్రజలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింద

కడియం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కడియం ఉన ్నత పాఠశాల ఆవరణలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు వెలుగుబం టి నాని ఆధ్వర్యంలో కడియం రైతులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. రైతులు వారి పొలంలో పండిన ధాన్యం 500 కిలోలు (5క్వింటాళ్ల) తీసుకువచ్చారు. ఆ ధాన్యంతో చంద్రబాబు ముఖచిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొన్నారు. కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.