TTD: టీటీడీ ఈవో పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:06 AM
సైబర్ నేరగాళ్ల అగడాలకు తిరుమల వేదికగా మారుతోంది.

విచారణకు ఆదేశించిన టీటీడీ
తిరుమల, జూలై 10(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల అగడాలకు తిరుమల వేదికగా మారుతోంది. ఏకంగా టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతోనే ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్ క్రియేట్ చేశారు. ‘శ్యామల రావు ఐఏఎస్’ అనే పేరుతో ఉన్న ఇందులో ఈవోకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా అప్‌లోడ్ చేశారు. ఇది తనది కాదని ఈవో శ్యామలరావు తేల్చిచెప్పారు. దీనిపై విచారణ చేపట్టాలని టీటీడీ విజిలెన్స్ విభాగాన్ని ఈవో ఆదేశించారు.