Share News

Welfare Meeting: 23న మాజీ సైనికుల సమస్యలపై సదస్సు

ABN , Publish Date - Apr 20 , 2025 | 06:24 AM

ఎన్‌టీఆర్‌, కృష్ణాజిల్లాలోని మద్రాసు రెజిమెంట్‌కి చెందిన మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు 23న సదస్సు. డిశ్చార్జి బుక్‌, పీపీవో, ఐడీ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌ తీసుకుని రావాలని అధికారులు సూచించారు.

Welfare Meeting: 23న మాజీ సైనికుల సమస్యలపై సదస్సు

విజయవాడ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలోని మద్రాసు రెజిమెంట్‌కు చెందిన మాజీ సైనికులు, మరణించిన సైనికుల కుటుంబ సభ్యుల సమస్యలు తెలుసుకోడానికి జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ఈ నెల 23న సదస్సు ఏర్పాటు చేసినట్లు రెజిమెంట్‌ సర్జన్‌ లెప్టినెంట్‌ కమాండర్‌, జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి కళ్యాణవీణ ఓ ప్రకటనలో తెలిపారు. సంక్షేమ కార్యాలయంలో జరగబోయే సదస్సుకు మాజీ సైనికులు, మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు డిశ్చార్జి బుక్‌, పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ (పీపీఓ), ఐడీ కార్డు, ఆధార్‌ కార్డు తీసుకునిరావాలని కోరారు. ఈ సదస్సులో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయాలని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 06:24 AM