Share News

Kadapa: ఎలక్ర్టిక్‌ బైక్‌ పేలి వృద్ధురాలు మృతి

ABN , Publish Date - Jun 28 , 2025 | 03:16 AM

ఎలక్ర్టిక్‌ బైక్‌ పేలి పక్కనే నిద్రిస్తున్న ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో చోటు చేసుకుంది.

 Kadapa: ఎలక్ర్టిక్‌ బైక్‌ పేలి వృద్ధురాలు మృతి

  • కడప జిల్లాలో ఘటన

ఎర్రగుంట్ల, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ఎలక్ర్టిక్‌ బైక్‌ పేలి పక్కనే నిద్రిస్తున్న ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. పోట్లదుర్తి రెడ్డిగారివీధిలోఉండేల ప్రదీ్‌పకుమార్‌రెడ్డి కుటుంబం నివాసముంటోంది. గురువారం రాత్రి ఆయన తన ఎలక్ర్టిక్‌ బైక్‌ను వరండాలో చార్జింగ్‌ పెట్టారు. బైక్‌ పక్కనే మంచంపై ఆయన తల్లి వెంకట లక్షుమ్మ(62) నిద్రించారు. ఇతర కుటుంబ సభ్యులు మిద్దెపై పడుకున్నారు. తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో బైక్‌ పేలి పక్కనే మంచంలో నిద్రిస్తున్న లక్షుమ్మకు మంటలంటుకున్నాయి.


గాఢనిద్రలో ఉండటంతో కాసేపటికి గానీ ఆమె గుర్తించలేదు. తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేసినా వీలు కాలేదు. వెంకట లక్షుమ్మ కేకలు విని కుటుంబ సభ్యులు కిందకు వచ్చి మంటలు ఆర్పారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 28 , 2025 | 03:16 AM