తాడిపూడి.. శోకసంద్రం!
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:53 AM
తాళ్లపూడి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినాన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడికి చెందిన ఐదుగురు మిత్రుల జలసమాధితో గ్రామం యావత్తూ శోకసంద్రంలో మునిగి పోయింది. గోదావరి నదీ తీరంలో కన్న బిడ్డలను పోగొట్టుకున్న కుటుంబాల వారి ఆర్తనాదాలతో, వారి బంధువుల ఓదార్పులతో తల్లడిల్లింది. చనిపోయిన వారి మృతదేహాలను వెతికే సమయంలో జిల్లా కలెక్టరు ప్రశాంతి అక్కడికి విచ్చేసి బాధిత కు

తల్లడిల్లిపోయిన కుటుంబ సభ్యులు
అందరూ చిన్న రైతుల బిడ్డలే
తాళ్లపూడి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినాన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడికి చెందిన ఐదుగురు మిత్రుల జలసమాధితో గ్రామం యావత్తూ శోకసంద్రంలో మునిగి పోయింది. గోదావరి నదీ తీరంలో కన్న బిడ్డలను పోగొట్టుకున్న కుటుంబాల వారి ఆర్తనాదాలతో, వారి బంధువుల ఓదార్పులతో తల్లడిల్లింది. చనిపోయిన వారి మృతదేహాలను వెతికే సమయంలో జిల్లా కలెక్టరు ప్రశాంతి అక్కడికి విచ్చేసి బాధిత కుటుంబాల వారిని కలిసి పరామర్శించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విచ్చేసి ఆయా కుటుంబాల వారిని ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి న్యా యం జరిగేలా అన్నివిధాలా కృషి చేస్తామ న్నారు. కాగా మృతుల్లో పడాల సాయి తండ్రి పడాల రాము మాట్లాడుతూ తనకు ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తానని, కొడుకు, కూతురు ఉన్నారని... ఉన్న ఒక్క కొడుకూ చదివి కుటుంబానికి ఆధారంగా ఉంటాడని అనుకుంటే ఇలా అయిపోయిందని రోధించాడు. మరో మృతుడు పడాల దురా ్గప్రసాద్ తండ్రి పడాల వెంకన్నదొర మాట్లాడు తూ తాను వ్యవసాయం చేస్తానని, తన ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు ప్రసాద్ ఐటీఐ చదువుతున్నాడని, చదువు అనంతరం పెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే ఇలా జరిగిం దని వాపోయాడు. గర్రే ఆకాష్ తండ్రి సీతా రాముడు మాట్లాడుతూ తాను వ్యవసాయం చేస్తానని, తనకు ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు ఆకాష్ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడని, పెద్ద చదువులు చదివి, తమ కుటుంబాన్ని ఆదుకుంటాడనుకుంటే ఘోరం జరిగిపోయిందని విలపించాడు. అని శెట్టి పవన్ తాత కామిశెట్టి పోసియ్య మాట్లా డుతూ తను వ్యవసాయ కూలీగా జీవిస్తు న్నానని, తన అల్లుడు మరణానంతరం తన కూతురు, మనుమడు తన దగ్గరే ఉంటున్నా రని, తన కూతురు తాళ్లపూడిలో ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తుండగా, ఆమెకు ఉన్న ఒక్క కొడుకూ కానరాని లోకాలకు వెళ్లిపో యాడని కన్నీరుమున్నీరయ్యాడు. తిరుమల శెట్టి పవన్ తండ్రి చిన రంగయ్య మాట్లాడు తూ ఉన్న కొద్దిపాటి పొలంతో పాటు తాను కౌలుకు వ్యవసాయం చేస్తున్నానని, కొడుకు మంచిగా చదివి పెద్ద ఉద్యోగం చేస్తాడ నుకుంటే కడతేరిపోయాడంటూ విలపించాడు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి దుర్గేష్
కొవ్వూరు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): తాడిపూడిలో గోదావరి స్నానానికి వెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందిన సంఘటనపై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్ర్భాంతి వ్యక్తం చే శారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం ని మిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మృతదేహాలను సందర్శించారు. బం ధువుల నుంచి ప్రమాదానికి గల వివరాలను అడి గి తెలుసుకున్నారు. మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించి బందువులకు అప్పగించాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఎం.పద్మశ్రీరాణి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయికిరణ్‌ను మంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కూ టమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రమా ద సంఘటనను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలతోపాటు సీఎంవో దృష్టికి తీసుకువెళ్లామన్నారు. మృతిచెందిన యువకులు జనసేన సభ్వత్వం కలిగి ఉన్నారని తెలిసిందని, పార్టీ సభ్యత్వం ఉన్నట్టుయితే రూ.5 లక్షలు ప్రమాదబీమా వస్తుందన్నారు. కాగా శవ పంచనామా పూర్తయ్యేవరకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆసుపత్రిలో ఉండిపోయారు. సెలవుదినం అయినప్పటికీ ప్రభుత్వాసుపత్రిలోని వైద్యులు అందరూ అందుబాటులో ఉండి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి అనంత రం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
సహాయం అందేలా చూస్తాం
ఎంపీ పురందేశ్వరి
రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): తాళ్లపూడి మండలం తాడిపూడి ఇసుక ర్యాంపు వద్ద స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతిచెందిన ఘటన బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై కలెక్టర్ ప్రశాంతితో ఫోన్‌లో ఆరా తీశారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు సాయం అందేలా చూస్తామన్నారు.